ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం.. మాగుంట రాఘవకు బెయిల్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది.  వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవరెడ్డికి బెయిల్ మంజూరైంది. అనారోగ్య కారణంతో ఢిల్లీ హైకోర్టు ఆయనకు షరుతులతో కూడిన నాలుగు వారాల బెయిల్ ను మంజూరు చేసింది.  ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఫిబ్రవరి 10న రాఘవను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.  

ALSO READ :ఆస్ట్రేలియా బీచ్‌లో మెటల్ సిలిండర్ కలకలం.. చంద్రయాన్-3 శిథిలాలేనా? 

తాజాగా రాఘవరెడ్డికి బెయిల్ మంజూరు కాగా ఈడీ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు.  గతంలో రాఘవకు బెయిల్ ఇచ్చినప్పుడు ఈడీ వ్యతిరేకించింది.  రాఘవ బెయిల్ ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.  మాగుంట రాఘవరెడ్డిని సౌత్ గ్రూప్‌లో కీలక పాత్రధారిగా రాఘవను ఈడీ పేర్కొంది. 

ఢిల్లీలో పలు జోన్లకు రాఘవ ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఈడీ ఆరోపించిన సంగతి తెలిసిందే. కోర్టు బెయిల్ మంజూర్ చేయడంతో మాగుంట రాఘవ విడుదలకానున్నారు. మరోవైపు ఈ కేసులో దినేష్ ఆరోరా అప్రూవర్ గా మారనున్నారు.  గతంలో సీబీఐ కేసులో అప్రూవర్ గా మారారు ఆరోరా.