సమస్యలు పరిష్కారించకుంటే ప్రగతి భవన్ ముట్టడిస్తాం

ఆసిఫాబాద్, వెలుగు: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే ప్రగతి భవన్ ముట్టడిస్తామని గ్రామ పంచాయతీ కార్మికులు హెచ్చరించారు. గురువారం ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదుట మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.. 21 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

ALSO READ :అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూంలు ఇవ్వాలి... ఆర్డీవో ఆఫీస్ ముందు బీజేపీ లీడర్ల ధర్నా

కార్మిక చట్టాలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం శ్రమ దోపిడీ పాల్పడుతోందన్నారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ,మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.