ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో మహాకుంభ మేళా ప్రారంభమైంది. దేశ విదేశాలనుంచి లక్షలాది మంది యాత్రికులు తరలివచ్చారు.. గంగా, జమునా, సరస్వతి నదులు కలిసి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేయడంలో మహాకుంభ మేళా షురూ అయింది. మహాకుంభం మేళా మొదటి రోజున దాదాపు 60 లక్షల మంది భక్తులు మోక్షం కోసం, పాపాలను ప్రక్షాళన చేస్తుందని నమ్మకంతో త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరిస్తున్నారు. ఓవైపు భక్తులు, సాధువులు, అఘోరాలు భక్తి పరవశంలో మునిగి తేలుతేంటే..మరోవైపు ఓ ఆసక్తికరమైన సంఘటనకు జరిగింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ALSO READ | మహా కుంభమేళాకు వెళ్తున్నారా.. అయితే ఓసారి ఈ అక్కాచెల్లెళ్ల కథ వినండి
కుంభమేళాలో యాత్రికులు సంగమం వద్ద స్నానం చేస్తున్న దృశ్యాలతో పాటు, మరొక వీడియో ఆన్‌లైన్‌లో కనిపించింది..ఈ వీడియోలో ఒక బాబా యూట్యూబర్‌ను చిమ్తా (పటాకులు)తో కొడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆ వీడియోలో కనిపిస్తున్నది బాబా మహాకాళ్ గిరి అని..ఆన్‌లైన్‌లో జోరుగా వైరల్ అవుతోంది. 34 సెకన్ల వైరల్ క్లిప్‌లో యూట్యూబర్ చేతిలో మైక్‌తో గుడారంలో కూర్చున్న బాబాని ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. అయితే యూట్యూబర్ ప్రశ్నలతో విసిగిపోయిన బాబా చిమ్తాతో కొట్టినట్లు కనిపిస్తోంది.
ఓ చేయి పైకెత్తి దీవిస్తున్న బాబాను యూట్యూబర్.. ‘‘మీరు ఎప్పుడు సన్యాసం తీసుకున్నారు ప్రశ్నించగా’’.. ‘‘చిన్నప్పటికి నుంచే’’ అనిబాబా సమాధానం చెప్పారు. బాబా సమాధానం చెబుతున్నాడులే.. ఇంకొన్ని ప్రశ్నలు అడుగుతే ఏమైతది అని యూట్యూబర్ ఉత్సాహం చూపించాడు. ‘‘మీరు దేవున్ని పూజించేందుకు ఏ భజన చేస్తారు ’’ అని అడిగాడు..దీంతో విసుగు చెందిన బాబా..యూట్యూబర్ పై విరుచుకుపడ్డాడు. చేతిలో ఉన్న చిమ్తాతో కొట్టడం ప్రారంభించాడు.. ఇక యూట్యూబర్ బాబానుంచి తప్పించుకొని పరుగులు పెట్టాడు.
వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడం.. నెటిజన్లు సెటైర్లతో కామెంట్స్ పెట్టారు.. ఓ నెటిజన్ ఈ వీడియో పై స్పందిస్తూ..‘‘విసిగిస్తే గిలానే ఉంటది మరీ’’ అని చురకలంటించారు. పనికిరాని ప్రశ్నలతో చిరాకుపడి బాబా యూట్యూబర్‌ను చిమ్తాతో కొట్టారు. బాబాను తెలివిగా ప్రశ్నలు అడగాలి అని సూచించారు