మహాకుంభమేళాకు సర్వం సిద్దమైంది. ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh ) రాష్ట్రంలోని ప్రయాగ రాజ్(అలహాబాద్) వద్ద 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వ తేది వరకు నిర్వహించనున్న ప్రతిష్టాత్మక కుంభమేళా నిర్వహించనున్నారు. 12 సంవత్సరాకు ఒకసారి నిర్వహించే కుంభమేళాకు కోట్లాది మంది తరలి వెళుతున్నారు. 2025 లో జరిగే కుంభమేళాలో తిరుమల శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఉత్తర ప్రదేశ్‌లో కుంభమేళ అధికారి విజయ్ కిరణ్ ఆనంద్‌ను టీటీడీ జేఈవో గౌతమి అధికారికంగా కలిసి స్థలాన్ని కేటాయించాల్సిందిగా కోరారు .
12 ఏళ్లకు ఓసారి నిర్వహించే.. కుంభమేళాకు కోట్లాది మంది తరలివెళ్తుంటారు. ఇంతటి ప్రతిష్ఠాత్మక కుంభమేళా కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా భాగం కానుంది. ప్రతిష్టాత్మక కుంభమేళా కార్యక్రమంలో పాల్గొని దేశవ్యాప్తంగా హిందు ధర్మ ప్రచారంలో టీటీడీ కూడా భాగస్వామ్యం పంచుకోనుంది. కుంభమేళాను పురస్కరించుకుని ప్రయాగ్‌రాజ్‌లో టీటీడీ నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేయనుంది.
ప్రయాగరాజ్‌లో.. తిరుమల శ్రీవారి ఆలయ నమూనా ఏర్పాటుకు ఆరో సెక్టార్లో 2.50 ఎకరాల స్థలాన్ని టీటీడీకి కేటాయించింది. ఈ స్థలాన్ని టీటీడీ జేఈవో గౌతమి .. అధికారులతో కలిసి పరిశీలించి పలు సూచనలు జారీ చేశారు. టీటీడీ బృందంలో హెచ్ డీపీపీ సెక్రటరీ శ్రీరామ్ రఘునాథ్, ఎస్ఈ జగదీశ్వర్ రెడ్డి, ఈఈ సురేంద్రనాథ్ రెడ్డి, స్థానిక అధికారులు ఉన్నారు.కుంభమేళాకు తరలివచ్చే ఉత్తరాది భక్తులను దృష్టిలో ఉంచుకుని నమూనా ఆలయం వద్ద ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు
అలహాబాద్ వద్ద ప్రయాగరాజ్ లో 45 రోజుల పాటు జరిగే కుంభమేళాలో తిరుమల తరహాలోశ్రీవారి కైంకర్యాలు , కళ్యాణోత్సవాలు . చక్రస్నానం జరుపుతామని వెల్లడించారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు, కళాబృందాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. యూపీ పోలీస్ అధికారులతో టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారులు సమన్వయం చేసుకుని పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు.