ఇంత వెధవల్లా ఉన్నారేంట్రా:కుంభమేళాలో మహిళల స్నానం ఫొటోలు, వీడియోలు అమ్ముతున్నారంట..!

ఇంత వెధవల్లా ఉన్నారేంట్రా:కుంభమేళాలో మహిళల స్నానం ఫొటోలు, వీడియోలు అమ్ముతున్నారంట..!

యూపీలో ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ఆథ్యాత్మిక సమ్మేళనం కొనసాగుతోంది. జవవరి 13న ప్రారంభమైనప్పటినుంచి  దేశ విదేశాలనుంచి వచ్చిన దాదాపు 551 మిలియన్ల మంది హిందుభక్తులు గంగా, జమునా, సరస్వతి కలయిక ప్రాంతం అయిన త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. చిన్నారులు, యువతులు, మహిళలు, వృద్దులు ఇలా అన్ని వయస్సులవారు మహాకుంభమేళాలో ఉత్సాహంగా పాల్గొంటుండగా.. కుంభమేళాలో కలత పెట్టే విషయాలు కొన్ని వెలుగు చూస్తు న్నాయి. సంగమంలో స్నానం చేస్తున్న మహిళల ఫొటోలను కొందరు దుర్మార్గులు సోషల్ మీడియా లో అమ్మకానికి పెట్టారు. 

కుంభమేళాలో మహిళలు స్నానం చేస్తున్న అభ్యంతరకరమైన వీడియోలను టెలిగ్రామ్ ఛానెళ్లలో రికార్డ్ చేసి అమ్ముతున్నారు. #mahakumbh2025, #gangasnan, #prayagrajkumbh వంటి హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించి ఫేస్‌బుక్, యూట్యూబ్ ,ఇన్‌స్టాగ్రామ్‌లలో అనుచిత వీడియోలు షేర్ అవుతు న్నాయి..ఈ పోస్ట్‌లు టెలిగ్రామ్‌లో అశ్లీల కంటెంట్గా అమ్ముతున్నారు. 

Also Read : అసెంబ్లీలో భారత క్రికెటర్ షమీపై రచ్చ

కుంభ్ ఫుటేజ్‌గా షేర్ చేయబడుతున్న కొన్ని వీడియోలు ఈవెంట్ సమయంలో రికార్డ్ చేయబడనప్పటికీ వాటిని కుంభ్ సంబంధిత కంటెంట్ అని తప్పుగా లేబుల్ చేస్తున్నారు. Ganga river open bathing group, Hidden bath videos group, Open bath videos group వంటి పేర్లతో అనేక టెలిగ్రామ్ లో కంటెంట్ వైరల్ అవుతోంది. వీటిలో ఇక్కడ మహిళలు స్నానం చేస్తూ, బట్టలు మార్చుకుంటున్న వీడియోలు అమ్ముడవుతున్నాయి.

టెలిగ్రామ్ లో ప్రైవేట్ ఆస్పత్రుల్లో మహిళల వైద్య పరీక్షలకు చేయించికుంటున్న ఫొటోలు, వీడియోలు కంటెంట్ అమ్ముడవుతున్న విషయం తెలిసిందే.. అయితే ఈ విష సంస్కృతి ఇప్పుడు మహాకుంభమేళాకు పాకింది. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే  ఇంత నిర్భయంగా ఇలాంటి వీడియోలను అమ్ముతున్నారు. 
ఇక ఈ విషయంపై ప్రయాగ్ రాజ్ పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఈ వార్తలపై స్పందిస్తూ.. ఇటువంటి సోషల్ మీడియా ప్రొఫైల్స్/టెలిగ్రామ్ గ్రూపులను గుర్తించి, ఎఫ్ ఐఆర్ నమోదు చేస్తామన్నారు.