మహా కుంభమేళా 2025 : కుంభమేళాతో 12 లక్షల తాత్కాలిక ఉద్యోగాలు

మహా కుంభమేళా 2025 : కుంభమేళాతో 12 లక్షల తాత్కాలిక ఉద్యోగాలు

న్యూఢిల్లీ: ప్రస్తుతం ప్రయాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఉత్తర ప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) లో  కొనసాగుతున్న మహాకుంభ మేళతో  12 లక్షల తాత్కాలిక ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని టెక్ కంపెనీ  ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ సర్వీసెస్ సీఈఓ సచిన్ అలుగ్  అంచనావేశారు. ఈ నెల 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగే మహాకుంభ మేళలో 40 కోట్ల మంది పాల్గొంటారని అంచనా. ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్, ఈవెంట్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సెక్యూరిటీ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లోకల్ ట్రేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టూరిజం, ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి వివిధ సెక్టార్లలో ఉద్యోగాలు క్రియేట్ అవుతాయని సచిన్ తెలిపారు.

 ఒక్క  టూరిజం అండ్ హాస్పిటాలిటీ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే 4.5 లక్షల జాబ్స్ వస్తాయని,  ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టేషన్  అండ్ లాజిస్టిక్స్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 3 లక్షల ఉద్యోగాలు, టెంపరీ మెడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాంప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం 1.5 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు.