మహాకుంభమేళా ఇవాళ్నే లాస్ట్.. పుణ్యస్నానానికి కోటి మంది భక్తులు!

మహాకుంభమేళా ఇవాళ్నే లాస్ట్.. పుణ్యస్నానానికి కోటి మంది భక్తులు!
  • నేటితో ముగియనున్న మహా కుంభమేళా
  • ఇయ్యాల్నే చివరి పుణ్య స్నానం.. త్రివేణి సంగమానికి పోటెత్తుతున్న భక్తులు
  • శివరాత్రి కావడంతో కోటి మంది స్నానాలు చేస్తారని అంచనా
  • అధికారుల ప్రత్యేక ఏర్పాట్లు
  • నో వెహికల్ జోన్​గా ప్రయాగ్​రాజ్

మహాకుంభనగర్ (యూపీ): ప్రయాగ్​రాజ్​లో జరుగుతున్న మహాకుంభమేళాలో చివరి పుణ్యస్నానంకోసం భక్తులు భారీ సంఖ్యలో త్రివేణి సంగమానికి తరలి వస్తు న్నారు. బుధవారం జరిగే మహా శివరాత్రి వేడుకలతో కుంభమేళా ముగియనున్నది. సుమారు కోటి మంది భక్తులు పుణ్య స్నానం చేసేందుకు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. 

ఈ మేరకు ఎలాంటి తొక్కిసలాట జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నది. మంగళవారం సాయంత్రం నుంచే మేళా ఏరియాతో పాటు ప్రయాగ్​రాజ్ మొత్తాన్ని నో వెహికల్ జోన్​గా ప్రకటించింది. స్పెషల్ పాస్​లు ఉన్న వెహికల్స్ కు మాత్రమే అనుమతి ఉండనున్నది. 

అది కూడా వారికి కేటాయించిన ప్లేస్​లోనే వెహికల్ పార్క్ చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. పాలు, కూరగాయలు, మెడిసిన్స్, ఫ్యూయెల్ తో పాటు ఎమర్జెన్సీ సేవలు అందించే వెహికల్స్​కు మినహాయింపు ఇచ్చారు. డాక్టర్లు, పోలీసు అధికారులు, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కు కూడా వెసులుబాటు కల్పించారు.

హైవేలపై పోలీస్ మోటార్ బైక్ టీమ్​లు

ప్రయాగ్​రాజ్ వైపు వెళ్లే అన్ని మేజర్ హైవేలపై 40 పోలీస్ మోటార్ బైక్ టీమ్​లను ఏర్పాటు చేశారు. మంగళవారం సుమారు 50 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. లక్నో, ప్రతాప్​గఢ్ నుంచి వచ్చే భక్తుల కోసం ఫాఫామౌ ఘాట్​వద్ద అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రేవాన్, బండా, చిత్రకూట్, మిర్జాపూర్ నుంచి వచ్చే భక్తులు.. అరైల్ ఘాట్ వద్ద పుణ్య స్నానాలు ఆచరించనున్నారు. కౌశాంబి నుంచి వచ్చే భక్తుల కోసం సంగమ్ ఘాట్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 

చత్తీస్​గఢ్​లోని ఖైదీలకు జైళ్లలో పుణ్య స్నానాలు

జనవరి 13న మహా కుంభ మేళా ప్రారంభమైంది. ఇప్పటివరకు 65 కోట్లకు పైగా భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. 45 కోట్ల మంది భక్తులు వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేసింది. కానీ.. అనూహ్యంగా 65 కోట్లకు పైగా భక్తులు త్రివేణి సంగమంలో స్నానాలు చేశారు. ఫిబ్రవరి 11 నాటికే 45 కోట్ల మంది భక్తులు తరలివచ్చారు. 

ఆ తర్వాతి మూడు రోజుల్లోనే భక్తుల సంఖ్య 50 కోట్లు దాటింది. కాగా, చత్తీస్​గఢ్​లోని అన్ని జైళ్లలో ఉన్న సుమారు 18,500 మంది ఖైదీలు పుణ్య స్నానాలు ఆచరిం చారు. వీరి కోసం ట్యాంకర్ల ద్వారా త్రివేణి సంగమం నుంచి నీళ్లు తీసుకొచ్చినట్లు జైలు అధికారులు తెలిపారు. 5 సెంట్రల్ జైళ్లు, 20 డిస్ట్రిక్ జైళ్లు, 8 సబ్ జైళ్లలో పుణ్య స్నానాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.