
శివ్వంపేట, వెలుగు: మహా శివరాత్రి సందర్భంగా బుధవారం శివ్వంపేట మాజీ జడ్పీటీసీ మెంబర్ పబ్బా మహేశ్ గుప్తా ప్రయాగరాజ్ మహా కుంభమేళా నుంచి తీసుకువచ్చిన పవిత్ర నదీ జలాలను ఇంటింటికీ పంపిణీ చేశారు. ఇటీవల ప్రయాగ్ రాజ్ వెళ్లిన ఆయన రెండు వాహనాల 1000 లీటర్ల నీటిని తీసుకొచ్చి బాటిళ్లలో నింపి ఇంటికొక లీటర్ బాటిల్ పంపిణీ చేశారు.
మహా కుంభమేళాకు వెళ్లలేని వారికోసం ఈ ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. శివరాత్రి రోజే ఆయన బర్త్ డే రావడంతో ఆయన అభిమానులు భారీ కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ముగ్దూంపూర్ బేతాని సంరక్షణ కేంద్రంలోని అనాథ పిల్లలకు నిత్యావసర సరుకులు, పండ్లు పంపిణీ చేశారు. మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ రమాకాంత్ రెడ్డి పాల్గొన్నారు.