మహాకుంభమేళాలో బ్యూటీ క్వీన్ మోనాలిసా.. వావ్..ఏమి అందం..ఇప్పుడు ఈమె గురించే నెట్టింట చర్చ

మహాకుంభమేళాలో బ్యూటీ క్వీన్ మోనాలిసా.. వావ్..ఏమి అందం..ఇప్పుడు ఈమె గురించే నెట్టింట చర్చ

మహాకుంభమేళా.. ఆథ్యాత్మిక సమ్మేళనం.. హిందూ మహా సమ్మేళనం.. ప్రయాగ్ రాజ్ లోసాధువులు, భక్తులు, హిందు సమాజం.. గంగా, యమునా, సరస్వతి నదులు కలయిక త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలతో పునీతులవుతున్న సమయం.. భక్తితో మార్మోగిన ఆథ్యాత్మిక ప్రదేశంలో ఓ  సాధారణ అమ్మాయి.. అందరిని ఆకట్టుకుంది..చూపు తిప్పుకోకుండా చేసింది.. సెల్ఫీలతో ఆ అమ్మాయిని చుట్టుముట్టారు అక్కడికొచ్చినవారంతా.. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ఈ అమ్మాయే.. ఏమిటీ ఆమెలో స్పెషల్..  

వైభవంగా జరుగుతున్న మహాకుంభమేళా శనివారం ఆరో రోజుకు చేరుకుంది. ప్రయాగ్‌రాజ్‌లోని పవిత్రమైన త్రివేణి సంగమం వద్ద ప్రతిరోజూ జరిగే ప్రపంచంలోని అత్యంత పురాతనమైన ,అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనంలో లక్షలాది మంది ప్రజలు పాల్గొంటున్నారు.

ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన భక్తులు సంగం వద్ద సాక్షులుగా నిలిచారు. ఆధ్యాత్మిక శుద్ధి కోసం, వారి పాపాలను తొలగించుకోవాలని కోరుతూ పవిత్రమైన నదిలో పవిత్ర స్నానం చేస్తున్నారు. 

Also Read : ఐదేళ్లలో ఇండియా ఆటో ఇండస్ట్రీ నెంబర్‌‌‌‌‌‌‌‌ వన్‌‌‌‌

అదే సమయంలో ఐఐటీ బాబా, మోడల్‌గా మారిన సాధ్వి హర్ష రిచార్య వంటి భిన్నమైన వ్యక్తులు మతపరమైన సమ్మేళనంలో హైలైట్ గా నిలిచారు. అయితే కుంభ మేళాలో మరో హైలైట్.. మహాకుంభ్ మోనాలిసా.

ఇండోర్‌కు చెందిన 'మోనాలిసా భోంస్లే' అనే యువతిపై మహాకుంభ ఆశీస్సులన్నీ కురిపించినట్లు తెలుస్తోంది. నెటిజన్లు వర్ణించినట్లుగా ఈ అమ్మాయి తన అంత:సౌందర్యం, అందం, మెస్మరైజింగ్ కళ్లతో ఇంటర్నెట్ లో తుఫాన్ సృష్టిస్తోంది. 

'బ్రౌన్ బ్యూటీ' అని కూడా పిలువబడుతున్న ఈ అమ్మాయి మహాకుంభంలో ముత్యాల హారాలు అమ్ముతూ కనిపించింది. ఊహించని విధంగా ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో ఒక వీడియో 15 మిలియన్లకు పైగా చూశారంటే ఆశ్చర్యమేమి లేదు. 

అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లో ఊహించని సంఘటన ఇది. రోటీన్ కాకుండా ఈసారి జనాలు ఇండోర్‌కి చెందిన దండలమ్మేవారి వైపు ఆకర్షితులయ్యారు. భక్తులనే కాదు..మోనాలిసా తన 'డస్కీ' స్కిన్‌తో ఉలితో చెక్కిన శిల్పంలా పెద్ద-అందమైన కళ్లతో నెటిజన్లను ఆశ్చర్య పరిచింది. 

రీల్స్‌కి మిలియన్ల కొద్దీ వ్యూస్..

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మోనాలిసాపై ఇప్పటివరకు అనేక రీల్స్ సృష్టించబడ్డాయి. ఇన్‌స్టాగ్రామ్ , Xలో ఆమె పాపులారిటీ బాగా పెరిగింది. ఆమె కు సంబంధించిన వీడియోలను చేయడానికి సోషల్ మీడియా కంటెంట్ రైటర్స్ కూడా మహాకుంభమేళాలో ఆమెను చేరుకుంటున్నారు.  మరోవైపు నెటిజన్లు మోనాలిసా డస్కీ స్కిన్, బ్లూ కోహ్ల్‌తో ఉన్న ఆమె అందమైన కళ్ళు , స్వచ్ఛమైన చిరునవ్వుపై కామెంట్ సెక్షన్లలో పొగడ్తలతో ముంచెత్తారు.

లక్షలాది మంది ప్రజలు మోన్లీసా అందాన్ని వర్ణించడంలో నిమగ్నమై ఉండగా ఒక పవిత్ర కార్యక్రమంలో మగవారు ఆమెను వెంబడించి అనవసరమైన ప్రశ్నలు వేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. పవిత్రమైన మహాకుంభమేళా జనవరి 13న ప్రారంభమై ఫిబ్రవరి 26న ముగియనుంది.