మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై యూపీ సీఎం ఆదిత్యానాథ్ భక్తులనుద్దేశించి కీలక ప్రకటన చేశారు..భక్తులంతా సమీప ఘాట్లలోల పుణ్య స్నానాలు చేయాలని సూచించారు.. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని త్రివేణి సంగమం వైపు వెళ్లొద్దని చెప్పారు. వదంతులు ఎవరూ నమ్మొద్దని సీఎం ఆదిత్యానాథ్ భక్తులకు విజ్ణప్తి చేశారు.
ప్రయాగ్ రాజ్ లోని సెక్టార్ 2 వద్ద బుధవారం తెల్లవారు జామున జరిగిన తొక్కిస లాటలో 20 మంది భక్తులు మృతిచెందారు.. 100మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. త్రివేణి సంగమం బద్ద బారీకేడ్లు విరిగి ప్రమాదానికి దారి తీసింది. ఈ ఘటన దృష్టిలో ఉంచుకొని సీఎం యోగి ఆదిత్యా నాథ్ ఈ ప్రకటన చేశారు.
ALSO READ | మహాకుంభ తొక్కిసలాటకు వీఐపీ ఫోకస్ కారణం:రాహుల్ గాంధీ
మౌని అమావాస్య పుణ్య స్నానాలు చేసేందుకు బుధవారం దాదాపు 10 మంది కోట్ల మంది భక్తులు తరలివచ్చారని తెలిపారు. ఈ క్రమంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని చర్యలు చేపట్టామన్నారు. భక్తులు త్రివేణి సంగమం వైపు వెళ్లొద్దని.. సమీపఘాట్లలో పుణ్య స్నానమాచరించాలని కోరారు.
ప్రయాగ్ రాజ్ తొక్కిసలాట ఘటన పై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు. కేంద్ర తరపున అవసరమైన సాయం అందిస్తామని ప్రకటించారు.