కుంభమేళా నీళ్లు శుభ్రంగా ఉన్నాయి.. బ్యాక్టీరియా ఏమీ లేదు : సీఎం యోగీ

కుంభమేళా నీళ్లు శుభ్రంగా ఉన్నాయి.. బ్యాక్టీరియా ఏమీ లేదు : సీఎం యోగీ

కుంభమేళాలో నీళ్లు అపరిశుభ్రంగా ఉన్నాయని, మల బ్యాక్టీరియా సోకుతుందని జరుగుతున్న ప్రచారాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యా నాథ్ ఖండించారు. ఇది మతపరమైన సమ్మేళనాన్ని అవమానపర్చడమేనని అన్నారు. త్రివేణి సంగమంలో నీరు పరిశుభ్రంగా ఉందని పవిత్ర స్నానాలు చేయొచ్చని, ఇలాంటి ప్రచారం మానుకోవాలని సీఎం యోగి ఆదిత్యానాథ్ చెప్పారు. 

కుంభమేళా సంగంలో నీటి నాణ్యతపై వస్తున్న ఆరోపణలపై సీఎం యోగి ఆదిత్యానాథ్ యూపీ అసెంబ్లీలో మాట్లాడారు. కుంభమేళాలో పుణ్యస్నానమాచరించే  ప్రదేశం త్రివేణి సంగమం వద్ద నీటి శుభ్రతపై పలు పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అలాంటిది ఏం లేదు.. యూపీ కాలుష్య నియంత్రణ బోర్డు ఎప్పటికప్పుడు నీటి నాణ్యతను పరీక్షీస్తోంది.. సంగంలో చుట్టుపక్కల నీరు కలుషితం కాకుండా అన్ని ఏర్పాటు చేశారు..

నీటిని శుద్ది చేసిన తర్వాతే విడుదల చేస్తున్నారు. సంగం సమీపంలో బీఓడీ పరిమాణం 3కంటే తక్కువ, కరిగిన ఆక్సిజన్ 8నుంచి 9 వరకు ఉంది. నీరు పూర్తిగా పరిశుభ్రంగా ఉంది.. స్నానం చేయడమే కాదు.. ఆచ్ మాన్( పూజకు ముందు నీటిని సేవించడం) కూడా చేయొచ్చని యోగీ ఆదిత్యానాథ్ చెప్పారు.