మహా నిమజ్జనానికి 25 వేల మందితో బందోబస్త్..

మహా నిమజ్జనానికి 25 వేల మందితో బందోబస్త్..
  • ట్యాంక్‌‌‌‌ బండ్‌‌‌‌పై నిమజ్జనాలకు  నో పర్మిషన్
  • వెస్ట్‌‌‌‌ జోన్‌‌‌‌ పోలీసులతో సిటీ సీపీ సీవీ ఆనంద్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఈ నెల 17న మహా నిమజ్జనం, శోభాయాత్ర సందర్బంగా 25 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నట్లు సిటీ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. గణేశ్​నిమజ్జనం, మిలాద్‌‌‌‌ ఉన్ నబీ నేపథ్యంలో శుక్రవారం ఆయన వెస్ట్‌‌‌‌ జోన్‌‌‌‌ లా అండ్ ఆర్డర్‌‌‌‌, ట్రాఫిక్‌‌‌‌, ఎస్‌‌‌‌బీ పోలీసులతో భేటీ అయ్యారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈసారి ట్యాంక్‌‌‌‌ బండ్‌‌‌‌లో నిమజ్జనాలు ఉండవన్నారు. ఎన్‌‌‌‌టీఆర్‌‌‌‌‌‌‌‌ మార్గ్‌‌‌‌, నెక్లెస్ రోడ్​లో నిమజ్జనాలు చేసుకోవచ్చని చెప్పారు. 

రెండు వైపులా జీహెచ్‌‌‌‌ఎంసీ క్రేన్లు ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. శోభాయాత్రలో డీజేలు, మ్యూజిక్ సిస్టమ్‌‌‌‌, పటాకులకు అనుమతి లేదని సీపీ స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు సిటీలో వైన్స్, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. బాలాపూర్ నుంచి పాతబస్తీ మీదుగా కొనసాగే శోభాయాత్రపై స్పెషల్​ఫోకస్​పెట్టామన్నారు.