
మెదక్ టౌన్, వెలుగు: కార్తీక మాసాన్ని పురస్కరించుకొని శ్రీ కోదండ రామాలయంలోని శ్రీ భవానీ చిదంబర స్వామి శివాలయంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మహా రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పరమశివుడు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం అన్న దాన కార్యక్రమం నిర్వహించారు.
రెండో రోజు సోమవారం ఉదయం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమంలో శాస్త్రుల రామకృష్ణ శర్మ, దేశాయి పేట అంకుశ్ శర్మ, కరణం పవన్ కుమార్ శర్మ, అభిలాష్ శర్మ, భాష్యం మధుసూదన చార్యులు, కులకర్ణి పవనదత్తాసాయి శర్మ, దేశాయి పేట లింగమూర్తి శర్మ, వైద్య శ్రీనివాస్ శర్మ, సోమశేఖర రావు, హర్ష వర్ధన్ శర్మ, శ్రీవాండ్ల శ్రీనివాస్ శర్మ, ఆలయ కమిటీ చైర్మన్ నరేందర్, సభ్యులు నందిని శ్రీనివాస్, బద్రినాథ్, మల్లేశంపాల్గొన్నారు.