వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మార్చి7,8,9 తేదీల్లో మహా శివరాత్రి జాతర నిర్వహించనున్నామని దేవస్థాన అధికారులు తెలిపారు. 7న రాత్రి 7.30 గంటలకు టీటీడీ అధికారులు పట్టు వస్త్రాల సమర్పిస్తారన్నారు. అర్ధరాత్రి (8వ తేదీ) 12 గంటల నుంచి 2.30 గంటల వరకు స్థానిక ప్రజలకు సర్వదర్శనం, 2.-30 నుంచి 3-.30 గంటల వరకు ప్రజాప్రతినిధులకు, స్థానిక అధికారులకు దర్శన అవకాశం కల్పిస్తామన్నారు.
3.-30 నుంచి 3.-40 గం టల వరకు మంగళవాయిద్యాలు, 3 -40 నుంచి 4-.30 గంటల వరకు సుప్రభాత సేవ, ఆలయ శుద్ధి, 4.-30 నుంచి ఉదయం 6-గంటల వరకు ప్రాతః కాల పూజ, అనువం శిక అర్చకుల దర్శనం ఉంటుందన్నారు. ఉదయం 8-.30 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నారు. సాయంత్రం 4- నుంచి 5- గంటల వరకు శివ దీక్ష స్వాములకు దర్శనం, 6 నుంచి రాత్రి 8 గంటల వరకు మహా లింగార్చన, అనువంశిక బ్రాహ్మణుల దర్శనం ఉంటుందన్నారు. లింగోద్భవ సమయమైన రాత్రి 11.-35 గంటల నుంచి స్వామి వారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తారని చెప్పారు.