
హిందూ ధర్మ శాస్త్రంలో మహా శివరాత్రి రోజుకు చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రిని జరుపుకుంటున్నాం . ప్రజలు ఉపవాసం ఉండి, రాత్రంతా మేల్కొని శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి శివ మంత్రాలను జపిస్తారు. జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం పార్వతి పరమేశ్వరులను ప్రసన్నం చేసుకునేందుకు మహాశివరాత్రి నాడు ఏరాశి వారు ఎలా పూజ చేయాలో తెలుసుకుందాం.
మేష రాశి: మహాశివరాత్రి పర్వదినాన శివ పూజ సమయంలో లింగాష్టకాన్ని జపిస్తే మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఈశ్వరుడికి ఎర్రటి పువ్వులు, ఎర్రచందనం, ఎర్రని రంగులో ఉండే పండ్లను సమర్పిస్తే శివకటాక్షం లభిస్తుంది.
వృషభ రాశి : ఈ రాశి వారు శివరాత్రి రోజున మల్లెపూలతో శివారాధన చేసుకోవాలి. తర్వాత రుద్రాష్టకం చదువుకోవాలి.ఇలా చేస్తే వృషభ రాశివారి కోర్కెలు నెరవేరుతాయని జ్యోతిష్య నిపుణుల ద్వారా తెలుస్తుంది.
మిథున రాశి: మహాశివరాత్రి వేళ శివలింగానికి జలాభిషేకం చేస్తే మంచి జరుగుతుంది. శివలింగానికి చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. అంతే కాదు శివాష్టకాన్ని పఠిస్తే, శక్తి సామర్ధ్యాల మేరకు శివరాత్రి వేళ దానధర్మాలు చేస్తే శుభం కలుగుతుంది. అనేక రెట్లు పుణ్యం లభిస్తుంది.శివలింగానికి నీలిరంగు పువ్వులు సమర్పించి దీపం వెలిగించి పూజించండి.
కర్కాటక రాశి: ఈ రాశి వారు మహా శివరాత్రి రోజున జనపనారతో కలిపిన ఆవుపాలతో శివలింగానికి అభిషేకం చేసి రుద్రాష్టాధ్యాయిని పఠించాలి. మహా శివరాత్రి కర్కాటక రాశి వారికి అనేక భావోద్వేగాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. మీరు ఆంతరంగికంగా శాంతిని పొందుతారు. ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతతను సాధించవచ్చు.
సింహ రాశి: ఈ రాశి వారు మహా శివరాత్రి నాడు ఎర్రని తామరలతో శివుడికి పూజ చేసుకోవాలి. శివాలయంలో శ్రీ శివ చాలీసా పారాయణం చెయ్యాలి.శివుని పూజలో పెరుగు, చక్కెర, బియ్యం, తెల్ల చందనం ఉపయోగించాలి.
కన్యా రాశి: మహా శివరాత్రి రోజున దుర్వా గడ్డి, తేనె, నీటిలో కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత పొందుతారు. అలాగే బిల్వ పత్రాలు శివలింగం మీద ఉంచాలి.
తులా రాశి: శివుని ప్రసన్నం చేసుకోవడానికి,శివరాత్రి రోజున మహాదేవునికి పెరుగుతో అభిషేకం చేసి శివాష్టకం పఠించండి . శివుడికి నల్ల పువ్వులు సమర్పించండి.
వృశ్చిక రాశి : ఈ రాశి వారు మహాశివరాత్రి వేళ రుద్రాష్టకం పఠిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి. శివుని ప్రత్యేక అనుగ్రహం కలుగుతుంది. బెల్లం, పెరుగుతో శివునికి అభిషేకం చేయాలి. వీరు గులాబీ పువ్వులను, బిల్వపత్రాలను శివుడికి సమర్పిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.
ధనుస్సు రాశి: ఈ రాశి వారు పాలతో అభిషేకం చేయాలి. శివలింగానికి గంధం పూయాలి. పసుపు పూలతో పూజ చేయాలి. శివుని ఆశీస్సులు పొందడానికి భాంగ్, పాన్ సమర్పించాలి.
మకర రాశి: మహాశివరాత్రి పర్వదినాన మకర రాశి వారు శివుడికి అభిషేకాలు, అర్చనలు చేస్తే సమస్యల నుండి పరిష్కారం దొరుకుతుంది. విజయాలు వరిస్తాయి. ఈ రాశి వారు ధతురా, అష్టగంధ తదితర వస్తువులతో శివయ్యను పూజిస్తే శుభ ఫలితాలు వస్తాయి.
కుంభరాశి: ఈ రాశి వారు మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి శివుడిని ప్రత్యేకంగా పూజించడం ద్వారా మంచి సానుకూల ఫలితాలు లభిస్తాయి. శివునికి పాలు, పెరుగు, పంచదార, నెయ్యి, తేనెతో అభిషేకం చేసి, దానితో పాటు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించాలి.
మీన రాశి: ఈ రాశి వాళ్ళు తేనె, గంగాజలంతో.. పండ్ల రసంతో శివుని అభిషేకించాలి.దానితో పాటు ఓం భవేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించండి.ఇలా చేయడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి