
మేడ్చల్ జిల్లా కీసర గుట్ట శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా కీసరగుట్టలో ఫిబ్రవరి 24 నుంచి మార్చి 1 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 24న ఉదయం గణపతి హోమంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కావలసిన ఏర్పాట్లు చేసిన అధికారులు.
ఎండలు ఎక్కువగా ఉండడం వలన క్యు లైన్లో ఉండే భక్తుల కోసం చల్వ పందిర్లు మంచినీరు మజ్జిగ ఏర్పాటు చేయనున్నారు ఆలయ అధికారులు. లైన్ లో వచ్చే సామాన్య ప్రజలకు సులువుగా దర్శనమయ్యే విధంగా కావలసిన బారికేడ్లు అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఆలయం చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు పోలీసులు. నగరానికి దగ్గరలో కీసర గుట్ట ఉన్న నేపథ్యంలో చాలా వరకు భక్తులు స్వామి వారి దర్శనం కోసం వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని కుషాయిగూడ ఎసిపి మహేష్ కుమార్ అన్నారు. సుమారు 11 వందల మంది పోలీసులు ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొననున్నారని చెప్పారు. హైదరాబాద్ నగరంలోని పలు చోట్ల నుంచి కీసరగుట్టకు 270 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడవనున్నాయి