
ఝరాసంగం, వెలుగు: సంగారెడ్డి జిల్లాలోని కేతకీ సంగమేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామి వారు శేషవాహనంపై ఊరేగారు. మహిళలు మంగళహారతులతో వచ్చి స్వామిని కొలిచి ఆశీస్సులు తీసుకున్నారు.
జాతర సందర్భంగా డీఎస్పీ రాంమోహన్‌రెడ్డి పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సీఐలు హన్మంతు, శివలింగం, ఎస్ఐ నగేశ్, ఇన్స్పెక్టర్రంగారావు, ఈవో శివరుద్రప్ప, మాజీ ఎంపీపీ హన్మంత్‌రావు పాటిల్, ఉదయ్శంకర్పాటిల్పాల్గొన్నారు.