Maha Sivaratri 2025: శివరాత్రి రోజు (ఫిబ్రవరి 26) ఇలా చేయండి.. ఆర్థిక సమస్యలు తీరతాయి

Maha Sivaratri 2025: శివరాత్రి రోజు (ఫిబ్రవరి 26) ఇలా చేయండి.. ఆర్థిక సమస్యలు తీరతాయి

హిందువులు జరుపుకునే పండుగలలో మహా శివరాత్రి  ఒకటి. ఈ రోజున ఎంతో మంది భక్తులు శివాలయానికి వెళ్ళి పూజలు చేస్తారు. అయితే, ఈ ఏడాది (2025) మహా శివరాత్రి పండుగ ఫిబ్రవరి 26న వచ్చింది.   శివరాత్రి రోజు.. శివుడికి అభిషేకాలు, పూజలు  శివరాత్రి రోజు  జరుగుతాయి.  శివరాత్రి రోజున చేసే పనులు ఆర్థిక బాధల నుండి విముక్తిని ఇస్తాయట. ఇంతకీ ఆ రోజు ఏం చేయాలంటే.. 

శివరాత్రి శివ భక్తులకే కాకుండా యావత్ భారత ప్రజలకు ఎంతో ముఖ్యమైన రోజు. ఫిబ్రవరి 26 రోజున రాత్రంతా మేలుకుని జాగరణ చేసి శివ పూజలలోనూ,  శివ భజనలలోనూ లీనమై ఉంటారు. మాహా శివరాత్రి రోజు పెరుగులో తేనె కలిపి శివ లింగానికి అభిషేకం చెయ్యాలి.  శివుడిని అభిషేక ప్రియుడు అని అంటారు. పెరుగులో తేనె కలిపి అభిషేకం చేయడం వల్ల శివుడు సంతోషిస్తాడు. ఈ పని చేయడం వల్ల శివుడి ఆశీర్వాదం లభించి మధ్యలో ఆగిపోయిన పనులు తిరిగి పూర్తి అవుతాయని పండితులు చెబుతున్నారు. శ్రీరాముడు కూడా సీతాదేవిని అన్వేషించే సమయంల్ సైకత లింగానికి అడవిలో లభించే తేనె...పెరుగు కలిపి అభిషేకం చేసిన తరువాత.. హనుమంతుడు తారస పడటం లాంటి ఘటనలు జరిగాయని అరణ్యకాండలో ఉందని పండితులు చెబుతున్నారు. 
శివ పూజకు బిల్వపత్రం చాలా ముఖ్యం. శివరాత్రి రోజు( ఫిబ్రవరి 26)  బిల్వ పత్రం,  పూలు,  పండ్లు, పాలు, చందనం సమర్పించాలి.  ఇలా చేస్తే పూజ చేసే వారి మీద శివుడి అనుగ్రహం కలిగి.. ఆర్థిక సమస్యలు తీరుతాయని పురాణాల ద్వారా తెలుస్తుంది. 
ఓం నమః శివాయ ..  అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన సమస్యలు పరిష్కారమై జీవితంలో ఆర్థిక పురోభివృద్ధి కలుగుతుంది.
శివుడు నిరాడంబరుడు...  ఇతరులకు సేవ చేస్తే చాలా తొందరగా అనుగ్రహిస్తాడు.   శివరాత్రి రోజు నిరుపేదలకు, బీద వారికి,  సహాయం కోసం ఎదురు చూస్తున్నవారికి పాలు, పండ్లు,  పప్పు ధాన్యాలు, బియ్యం వంటి నిత్యవసరాలు దానం చెయ్యాలి.  ఇలా చేస్తే జీవితంలో దేనికి లోటు ఉండదు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఇంట్లో డబ్బు కొరత ఎదుర్కొంటున్నవారు ఇలా పేదలకు దాననం చేయడం వల్ల  వారి ఆర్థిక పరిస్థితి బలపడి జీవితంలో పురోగతి లభిస్తుందట. 
శివరాత్రి రోజు చాలా పవిత్రమైన రోజు. ఆ రోజున ( ఫిబ్రవరి 26) పరమేశ్వరుడికి  చెంబుడు నీళ్ళు పోస్తే..  భోళా శంకరుడు సంతోషించి .. జీవితంలో ఎదర్కొంటున్న ఎంతటి సమస్యను అయినా ఇట్టే  తొలగిస్తాడని  చెబుతున్నారు. 
శివునికి చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది. జీవితంలో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు.
 మహాశివరాత్రి నాడు మేకప్ వస్తువులను దానం చేస్తే వైవాహిక జీవితం సంతోషం .. ఆహ్లాదకరంగా మారుతుందని, లక్ష్మీదేవి సంతోషించి అనుగ్రహం కలుగుతుందని పురాణాలు చెబుతున్నారు. లక్ష్మీదేవి కూడా పార్వతీమాత అంసే కదా..!
మహా శివరాత్రి  ( 2025 ఫిబ్రవరి 26) నాడు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శివుడితో పాటు ఆంజనేయ స్వామి అనుగ్రహం లభిస్తుంది.పనులలో ఆటంకాలు తొలగిపోతాయి.
 శివరాత్రి రోజున  ఉపవాసం ఉండి భక్తితో ఆయనకి నిత్య పూజలు చేస్తే కోరిన కోర్కెలు తీరుస్తాడని భక్తులు నమ్ముతారు. ఆ రోజంతా ఆహారం ముట్టకుండా కేవలం ఫలాలు మాత్రమే తీసుకుని ఉపవాసాలు చేసి.. రాత్రి మొత్తం జాగరణ చేస్తుంటారు.