మహబూబాబాద్ జిల్లా: బయ్యారం మండలం లో ఉరుములుతో కూడిన భారీ వర్షం..

మహబూబాబాద్ జిల్లా: బయ్యారం మండలం లో ఉరుములుతో కూడిన భారీ వర్షం..

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. మహబూబాబాద్, కేసముద్రం, గూడూరు, నెల్లికుదురు, గార్ల, బయ్యారం మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. మహబూబాబాద్ పట్టణంలో సుమారు రెండు గంటల పాటు వర్షం కురవడంతో రహదారులు జలమయమయ్యాయి. నాళాలు పొంగి ప్రవహించాయి.బయ్యారం మండలం లో ఉరుములుతో కూడిన భారీ వర్షం పడింది.  జగ్నతండాను వరద నీరు చుట్టుముట్టింది. ఇండ్లలోకి భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.  ఆర్టీసీ కాలనీలో రోడ్లు జలమయమయ్యాయి.  

 మహబూబాబాద్‌, జనగామ జిల్లాల్లో  గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. రోడ్డు పక్కన ఉన్న చెట్లు విరిగి కిందపడ్డాయి. మహబూబాబాద్‌ మండలంలో పలు చోట్ల ఐదు విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. బలంగా వీచిన గాలికి పలు గ్రామాల్లో ఇంటి పైకప్పులు లేచిపోయాయి. విద్యుత్‌ స్తంభాలు విరగడంతో కరెంట్‌ సరఫరాను నిలిపివేశారు.

ALSO READ | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు మహిళా రైతు మృతి

బయ్యారంలో సుమారు రెండు గంటల పాటు భారీ వర్షం కురవగా చెట్లు, విద్యుత్‌ స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఇదే మండలంలోని సత్యనారాయణపురం గ్రామంలో కొబ్బరిచెట్టుపై పిడుగు పడింది. ఏజెన్సీ ప్రాంతంలో వరి, మక్కజొన్న, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. ఇటుక బట్టీల్లో ఇటుకలు తడిసిపోయాయి. జనగామ జిల్లా దేవరుప్పుల, పాలకుర్తి మండలాల్లోనూ భారీ వర్షం కురిసింది. కామారెడ్డిగూడెంలో పిడుగు పడడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.