మక్తల్ టౌన్ వెలుగు: మక్తల్ రైల్వే స్టేషన్ లో మహబూబ్ నగర్ టు మక్తల్ రైలును ఆదివారం ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మక్తల్ నుంచి జక్లర్ వరకు రైలులో జర్నీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతీ మంగళ, గురు వారాల్లో హైదరాబాద్ నుంచి మక్తల్ కు స్పెషల్ రైలు ఉంటుందని చెప్పారు. మక్తల్ రైల్వే స్టేషన్ లో జిమ్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో రైల్వే డీఈఎం సుబాకర్, మక్తల్ మార్కెట్ చెర్మన్ రాజేశ్ గౌడ్, మార్కెట్ డైరెక్టర్ రాజమహేందర్ రెడ్డి పాల్గొన్నారు.
For More News..