ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు.

మహబూబ్​నగర్/ గద్వాల, వెలుగు: మహబూబ్‌‌నగర్‌‌, గద్వాల, నాగర్‌‌‌‌ కర్నూల్‌‌ జిల్లాల్లో గురువారం భారీ వర్షం కురిసింది.  పాలమూరు జిల్లా కేంద్రంలో పెద్ద చెరువు అలుగు పొంగడంతో రామయ్యబౌలి, శివశక్తినగర్, బీకేరెడ్డికాలనీ, భగీరథ కాలనీ, షాషబ్​గుట్ట, న్యూటౌన్​కాలనీల్లోని ఇండ్లల్లోకి వరద నీరు చేరింది.  సరుకులు, సామన్లు  తడిసిపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. రోడ్లన్నీ చెరువులుగా మారడంతో బయటికి వెళ్లే పరిస్థితే లేకుండా పోయింది. ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు, అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ నీటమునిగిన రామయ్యబౌళిని ప్రాంతాన్ని పరిశీలించారు.  ధరూర్ మండలం  గుడ్డెం దొడ్డి గ్రామంలో సహదేవుడుకి చెందిన ఎద్దు పిడుగు పడి మృతి చెందింది.  ఇటిక్యాల మండలంలోని పెద్దవాగు ఉప్పొంగి పారడంతో రాకపోకలు బంద్ అయ్యాయి.     

రుణమాఫీకి కసరత్తు చేస్తున్నం

వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి, గోపాల్ పేట, వెలుగు: ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని   వ్యవసాయ శాఖ మంత్రి  నిరంజన్ రెడ్డి చెప్పారు. గురువారం వనపర్తి మండలం కాసీం నగర్ లో నిర్వహించిన  సింగిల్ విండో సర్వసభ్య సమావేశానికి  చీఫ్‌‌ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఏక్కడా అమలుకాని  వ్యవసాయ అనుకూల పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్నామన్నారు.

గతంలో సింగిల్ విండో లు నిరుపయోగంగా ఉండేవని,  ప్రస్తుతం ధాన్యం కొనుగోలు ద్వారా వచ్చిన కమీషన్ డబ్బులతో విండోలను బలోపేతం చేశామని వివరించారు.  గతంలో అప్పులు ఇవ్వడానికే అన్నట్లుండే సింగిల్‌‌ విండోలు  ఇప్పుడు రైతులను అప్పుల బెడద నుంచి  గట్టెక్కిస్తున్నాయని  చెప్పారు.  అనంతరం గోపాల్ పేట మండలం మున్ననూరు గ్రామంలో మంత్రి లబ్ధిదారులకు పింఛన్ కార్డులు, బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ మదుసుదన్, ఎంపీపీ కిచ్చారెడ్డి, నాయకులు వెంకట్రావు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే కళ్లలో ఆనందం కోసం ఎస్సైల ఆరాటం

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు 

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: తన అనుచరులపై తప్పుడు కేసులు పెట్టి, ఎమ్మెల్యే కళ్లల్లో ఆనందం చూసేందుకు ఎస్సైలు ఆరాటపడుతున్నారని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు.  గురువారం నాగర్ కర్నూల్‌‌లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌‌లో ప్రెస్‌‌మీట్‌‌ పెట్టి మాట్లాడారు.  తెలంగాణ ద్రోహి బీరం హర్షవర్ధన్ రెడ్డి కొల్లాపూర్‌‌‌‌ నియోజకవర్గంలోని పెద్దకొత్తపల్లి, చిన్నంబావి, కోడేరు, కొల్లాపూర్ ఎస్సైలు తమ అనుచరులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని వాపోయారు.

వీరిపై చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు, మంత్రులు, టీఆర్‌‌‌‌ఎస్‌‌ కార్యనిర్వాహక అధ్యక్షుడికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు.  పోలీసులు అందరూ చెడ్డవారు కాదని, కొందరి తీరువల్ల  ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందన్నారు.  ఫిర్యాదు దారులపైనే దాడులు చేయడం,  చిత్రహింసలు పెట్టడం ఇక్కడి పోలీసులకే చెల్లిందని మండిపడ్డారు.  ప్రభుత్వం కమాండ్ కంట్రోల్ సెంటర్‌‌‌‌ ఏర్పాటు చేసినా ఇక్కడి పీఎస్‌‌లలో సీసీ కెమెరాలు పనిచేయవన్నారు. ఎస్సైలపై చర్యలు తీసుకోకపోతే దసరా పండుగ తర్వాత  తెలంగాణ  ఉద్యమం తరహాలో ఆందోళన కార్యక్రమాలు చేపడతానని హెచ్చరించారు. ఈ సమావేశంలో మాజీ గ్రంథాలయ అధ్యక్షుడు విష్ణు, మాజీ ఎంపీపీ చేన్నయ్య, రహీం, హనుమంతు నాయక్, ఇక్బాల్, నాగరాజు, ధర్మ తేజ పాల్గొన్నారు.

భార్య, ప్రియుడే హంతకులు

గంగ్య హత్యకేసును ఛేదించిన పోలీసులు  

బాలానగర్, వెలుగు: మహబూబ్‌‌నగర్‌‌‌‌ జిల్లా బాలానగర్ మండలం జీడిగుట్ట తండాకు చెందిన గంగ్య హత్య కేసును పోలీసులు ఛేదించారు. భార్య, ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు తేల్చారు.  జడ్చర్ల సీఐ జమాలప్ప గురువారం బాలానగర్  పీఎస్‌‌లో ప్రెస్‌‌మీట్ పెట్టి వివరాలు వెల్లడించారు.  జీడిగుట్ట తండాకు చెందిన గంగ్య(38),  భార్య కేతావత్ లక్ష్మి( 34)లకు 14 ఏళ్ల కింద పెళ్లి అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు.

లక్ష్మి తండాకు చెందిన శ్రీనివాస్ (23)తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్తకు విషయం తెలియడంతో మందలించాడు. దీంతో అతన్ని చంపాలని నిర్ణయించుకున్న లక్ష్మి గత నెల 21న  శ్రీనివాస్‌‌తో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న గంగ్యను హత్య చేసింది. మృతుడి పేరెంట్స్‌‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  హత్య జరిగినట్లు మెడికల్‌‌ రిపోర్టు రావడంతో భార్యను అదుపులోకి తీసుకొని విచారించారు.  శ్రీనివాస్‌‌తో కలిసి ముఖంపై దిండు పెట్టి, గొంతు నులిమి చంపినట్లు ఒప్పుకుంది.  దీంతో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌‌ తరలించారు.

భారత్ బలమైన శక్తిగా ఎదుగుతోంది

బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ 

గద్వాల, వెలుగు: భారత్‌‌ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రపంచంలో బలమైన శక్తిగా ఎదుగుతోందని బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ చెప్పారు.  గురువారం ఎస్‌‌వీ ఈవెంట్ హాల్‌‌లో నిర్వహించిన మేథావుల సదస్సుకు చీఫ్ గెస్టుగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రక్షణ, వైద్య రంగంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనలో  దేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ప్రధాని మోడీ సర్జికల్ స్ట్రైక్, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్‌‌తో రక్షణ రంగం సామర్థ్యాన్ని  ప్రపంచానికి చాటి చెప్పారని కొనియాడారు.  తన దౌత్య నీతితో బద్ధ శత్రువైన పాకిస్థాన్‌‌ను అంతర్జాతీయ సమాజంలో అంటరాని దేశంగా నిలబెట్టారన్నారు.

అసాధ్యం అనుకున్న జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తికి సంబంధించిన 370 ఆర్టికల్ ను రద్దుచేసి సమానత్వాన్ని తీసుకొచ్చారన్నారు.  కరోనా సమయంలో ప్రపంచం ఆర్థిక మాద్యంలో చిక్కుకున్నా.. దేశం ఆ ఉచ్చులో పడకుండా కాపాడగలిగారన్నారు.  విదేశీ మారక నిల్వలు పెరిగాయని, బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేశారన్నారు.  హింసాత్మక ఘటనలతో పాటు వామపక్ష తీవ్రవాదం గణనీయంగా తగ్గిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సికింద్రాబాద్ ఇన్‌‌చార్జి నాగురావు నామాజీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, నేతలు రవి కుమార్ ఎగ్బొట్టే, మిర్జాపురం వెంకటేశ్వర్ రెడ్డి  పాల్గొన్నారు.

విరిగి పడ్డ కొండ చరియలు

అచ్చంపేట, వెలుగు: ఉమామహేశ్వర టెంపుల్ సమీపంలోని నాగుల వద్ద గురువారం కొండచరియలు విరిగిపడ్డాయి.  ఈ టైంలో భక్తులు లేకపోవడంతో ప్రమాదం తప్పిందని ఆలయ చైర్మన్​  సుధాకర్​, ఈవో శ్రీనువాస రావు చెప్పారు.

పోషకార లోపం లేని సొసైటీని నిర్మిద్దాం

కలెక్టర్ వల్లూరు క్రాంతి 

గద్వాల, వెలుగు:  పోషకార లోపం లేని సొసైటీని నిర్మిద్దామని కలెక్టర్ వల్లూరు క్రాంతి పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని కేఎస్ ఫంక్షన్ హాల్‌‌లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌‌ రెడ్డితో కలిసి మహిళా,శిశు, వృద్ధాప్య సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులు, అంగన్‌‌వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లకు అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మల్దకల్‌‌ మండలంలో 500 మంది,  గట్టు మండలంలో 400 మంది పోషకాహారం లోపంతో బాధపడుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయన్నారు.  వారందరినీ ఆరోగ్యంగా తీర్చిదిద్దేందుకు  కృషి చేయాలని కోరారు.  చైల్డ్ మ్యారేజెస్ నిర్మూలనకు సహకరించాలని, చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ మీటింగ్‌‌ని ప్రతి నెలా రెండో మంగళవారం పెట్టాలన్నారు.  అనంతరం బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్నారు.   జడ్పీ సీఈవో విజయ నాయక్, డీఎంహెచ్‌‌వో చందు నాయక్, జడ్పీ సీఈవో ముసాయిదా బేగం పాల్గొన్నారు.

బకాయిలు చెల్లించకుంటే భూములు వేలం వేస్తం

ధన్వాడ, వెలుగు :  ధన్వాడ సింగిల్​విండోకు కొండాపూర్‌‌‌‌కు చెందిన రైతులు బకాయి ఉన్న రూ.1.30 కోట్లు  వెంటనే  చెల్లించకపోతే ఆర్ఆర్​యాక్టు కింద డీసీసీబీ అధికారులతో భూములు వేలం వేయిస్తామని విండో అధ్యక్షుడు వెంకట్రామారెడ్డి హెచ్చరించారు. గురువారం నిర్వహించిన విండో మహజన సభలో ఆయన మాట్లాడుతూ కేంద్రం వన్​టైం సెటిల్​మెంట్​గడువును డిసెంబర్ ​నెలాఖరు వరకు పొడగించిందని, రుణం చెల్లిస్తే బాకీ మొత్తంలో 30 శాతం మాఫీ అవుతోందని చెప్పారు. అనంతరం రూ.కోటి బిజినెస్​ లోన్లు,  రూ.2 కోట్ల బంగారు రుణాలు ఇవ్వడంతో పాటు రూ.2.50కోట్లతో గోదాములు నిర్మించాలని తీర్మానించారు.  డీసీసీబీ మేనేజర్​ కల్పనరెడ్డి, విండో ఉపాధ్యక్షుడు బాల్​రాజ్​, సీఈవో వెంకట్రాములు, మాజీ ఎంపీటీసీ నాగిరెడ్డి, డైరెక్టర్లు రేవతి, వెంకట్​రావు, జగన్నాథ్​రెడ్డి పాల్గొన్నారు.

మంత్రి అనుచరులే అక్రమార్కులు

బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి 

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: డబుల్ బెడ్ రూం ఇండ్లలో స్కామ్‌‌లో మంత్రి శ్రీనివాస్‌‌ గౌడ్ అనుచరులే అక్రమార్కులని, వారిపై  చర్యలు తీసుకోవాలని  బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి డిమాండ్ చేశారు.  ఒక్క ఫొటో చూపించి బీజేపీ నాయకుడంటూ పార్టీపై బురదల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం  జిల్లా ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ  లబ్ధిదారుల నుంచి మంత్రి బంధువు వనగంటి ప్రకాశ్‌‌, అనుచరుడు ఇర్పాన్  డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు.

వీరిపై పీఎస్‌‌లో ఫిర్యాదు చేసినా  పట్టించుకోలేదన్నారు.  దివిటిపల్లి, వీరన్నపేట, క్రిష్టియన్ పల్లిలో నిర్మించిన ఇండ్ల వివరాలను ఆర్టీఐ కింద అడిగితే తహసీల్దార్‌‌‌‌ ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు.  బీజేపీ రాష్ట్ర  కార్యవర్గ సభ్యుడు పడాకుల బాలరాజు,  జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి సత్యం, అసెంబ్లీ కన్వీనర్  అంజయ్య, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

కులాలకతీతంగా  ‘పేదల బంధు’ ఇవ్వాలి

హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్

వనపర్తి, వెలుగు:  కులాలతో సంబంధం లేకుండా పేదల బంధు ఇవ్వాలని  హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.  గురువారం వనపర్తి జిల్లా కొత్తకోటలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో  సీఎం కేసీఆర్ కుటుంబం దోపిడీ ప్రజలకు తెలిసి పోయిందని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ  అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.  బీజేపీ చేపట్టిన భరోసా యాత్రలో ప్రజలు కేసీఆర్‌‌‌‌ను చీదరించుకుంటున్నారని,  సమస్యలపై అనేక అభ్యర్థనలు ఇస్తున్నారని చెప్పారు.

సీఎం పింఛన్లు అర్హులకు ఇవ్వడం లేదని, ఇండ్ల ముచ్చటే ఎత్తడం లేదన్నారు.   ఇంటి జాగా ఉంటే రూ. 3 లక్షలు ఇస్తామన్న హామీని గాలికొదిలేశారని విమర్శించారు. రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంకులు రైతులను లోన్ల ఎగవేతదారులుగా  ముద్ర వేస్తున్నాయని వాపోయారు.  నిరుద్యోగ భృతి, జాబ్స్‌‌ నోటిఫికేషన్లపై హామీలే తప్ప అమలు చేయడం లేదన్నారు.  బీజేపీ కులం, మతం పిచ్చి గల పార్టీ కాదని, అన్నివర్గాల అభివృద్ధి, సంక్షేమం కోరే పార్టీ  అని స్పష్టం చేశారు.  ఈ కార్యక్రమంలో  పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజవర్ధన్ రెడ్డి, మహబూబ్ నగర్ పార్లమెంట్ ఇన్‌‌చార్జి  డోకూరు పవన్ కుమార్ రెడ్డి, ఎగ్గని నర్సింహులు, అశ్వత్థామ రెడ్డి, భరత్ భూషణ్, మాధవ రెడ్డి, అమరేందర్ రెడ్డి  పాల్గొన్నారు.

మాస్టర్ ప్లాన్ కోసం సమాచారం ఇవ్వండి

వనపర్తి, వెలుగు:  మున్సిపాలిటీల మాస్టర్ ప్లాన్  కోసం సమగ్ర సమాచారం ఇవ్వాలని అడిషనల్ కలెక్టర్లు ఆశీష్ సంగ్వాన్, వేణుగోపాల్  ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌‌లో మున్సిపల్ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్, ఆర్‌‌‌‌అండ్‌‌బీ,  ఇరిగేషన్,  ఫారెస్ట్ తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు మార్చిలోగా మున్సిపాలిటీల మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాలన్నారు.  డిసెంబర్ వరకు  సమగ్ర సమాచారం ఇవ్వాలని 
ఆదేశించారు.