గూడూరు, వెలుగు: సీజనల్ వ్యాధులతో జాగ్రత్తగా ఉండాలని మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ ఆఫీసర్లను ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు ప్రభుత్వ ఆస్పత్రి, గురుకుల పాఠశాల, వసత గృహాలు, సంక్షేమ హాస్టళ్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల, బాలికల, బాలుర వసతి గృహాలు, జూనియర్ కళాశాలల్లో బోధన, వసతి, వంటకాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను సందర్శించి అక్కడ అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో మందుల స్టాక్ వివరాలు పరిశీలించారు. కలెక్టర్ వెంట డాక్టర్ లక్ష్మణ్, రాజ్ కుమార్, స్రవంతి, డీటీ కోమల, ఎంపీడీవో వీరస్వామి, ఎంపీవో సత్యనారాయణ ఉన్నారు.