పోలింగ్‌‌ కేంద్రాల్లో సౌలత్‌‌లపై రిపోర్ట్‌‌ ఇవ్వండి

మహబూబాబాద్, వెలుగు : పోలింగ్‌‌ కేంద్రాల్లో అన్ని సౌలత్‌‌లు కల్పించేందుకు అవసరమైన రిపోర్ట్‌‌ను అందజేయాలని మహబూబాబాద్‌‌ కలెక్టర్‌‌ అద్వైత్‌‌ కుమార్‌‌ సింగ్‌‌ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌‌లో నిర్వహించిన రివ్యూలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని పోలింగ్‌‌ కేంద్రాలను ఆఫీసర్లు పరిశీలించి అవసరమైన సౌలత్‌‌లను గుర్తించాలని సూచించారు.

ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లపై దృష్టి పెట్టాలన్నారు. ఓటింగ్‌‌ శాతం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో ఎస్పీ సంగ్రామ్‌‌ సింగ్‌‌ పాటిల్‌‌, ఆర్డీవోలు అలివేలు, నరసింహారావు, డీఆర్డీవో సన్యాసయ్య పాల్గొన్నారు.