పథకాలు పేదలకు అందేలా కృషి చేయాలి

పథకాలు పేదలకు అందేలా కృషి చేయాలి

మహబూబాబాద్/ నర్సింహులపేట (మరిపెడ), వెలుగు: ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు అధికారులు అంకితభావంతో పనిచేయాలని మహబూబాబాద్​ కలెక్టర్  అద్వైత్ కుమార్ సింగ్ కోరారు. సోమవారం కలెక్టరేట్​లో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ నేటి నుంచి 24 వరకు నిర్వహించే గ్రామ సభలను షెడ్యుల్ వారీగా ఖచ్చితంగా సమయపాలన పాటిస్తూ నిర్వహించాలని కోరారు. అభ్యంతరాలుంటే దరఖాస్తులు స్వీకరించాలన్నారు.

 గ్రామ సభల తీర్మాన ప్రతులను భద్రపరచాలని సూచించారు. సమావేశంలో అడిషనల్​కలెక్టర్లు లెనిన్​ వత్సల్​ టొప్పో, కె. వీరబ్రహ్మాచారి, జడ్పీ సీఈవో పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. అనంతరం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో పర్యటించిన కలెక్టర్​ పలు వార్డులు, ట్రైబల్ వెల్ఫెర్ వసతి గృహాల్లో జరుగుతున్న డెవలప్మెంట్ పనులను పరిశీలించారు. శానిటేషన్ మెరుగ్గా ఉండేలా చూడాలన్నారు.