మహబూబాబాద్, వెలుగు: ఇందిరమ్మ గృహలు, నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలు అర్హులకు అందించేలా చూడాలని మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నూతన రేషన్ కార్డుల మంజూరు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించాలని అందుకోసం అన్ని విభాగాలతో కలిపి ఒక బృందంగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు లెనిన్ వత్సల్ టోప్పో, కె.వీరబ్రహ్మచారి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వసతి గృహాల నిర్వహణపై సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని సంక్షేమ వసతి గృహాల్లో ప్రభుత్వం కల్పించిన డైట్ మెనూ ప్రకారం రుచికరమైన ఆహారాన్ని అందించాలన్నారు. పిల్లలకు అందిస్తున్న ఆహారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో పురుషోత్తం, డీఈవో రవీందర్ రెడ్డి తదితరులున్నారు.