సిబ్బంది కేటాయింపును స్పీడప్‌‌ చేయాలి

మహబూబాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల కోసం సిబ్బంది కేటాయింపును స్పీడప్‌‌ చేయాలని మహబూబాబాద్‌‌ కలెక్టర్‌‌ కె.శశాంక ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌‌లో మాట్లాడుతూ ఎన్నికల విధులకు అవసరమైన ఉద్యోగ, ఉపాధ్యాయుల వివరాలు సేకరించాలని చెప్పారు. రెండు నియోజకవర్గాల్లో ఉన్న 539 పోలింగ్‌‌ కేంద్రాలకు 2,156 మంది సిబ్బంది అవసరం అవుతారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఒక్కో పోలింగ్‌‌ స్టేషన్‌‌లో ఒక పీవో, ఏపీవో, పోలింగ్‌‌ క్లర్క్‌‌లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ALS0 READ: ఎలక్షన్​​ కోడ్ అమలు చేయాల్సిందే : వినోద్​ కుమార్​
 

పోలింగ్‌‌ కేంద్రాల వారీగా విధుల కేటాయింపు, స్థానికులు, స్థానికేతరులు, ఇతర  వివరాల సేకరణ ప్రక్రియను పూర్తి చేసి ప్రత్యేక ఫార్మాట్‌‌లో అప్‌‌లోడ్‌‌ చేయాలని ఆదేశించారు. అడిషనల్‌‌ కలెక్టర్​ డేవిడ్, సీపీవో సుబ్బారావు, నోడల్ ఆఫీసర్ ​సూర్యనారాయణ, సూపరింటెండెంట్‌‌ పవన్‌‌ పాల్గొన్నారు.