ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలి : కలెక్టర్‌‌ శశాంక

మహబూబాబాద్, వెలుగు : ప్రభుత్వ ఆస్తులను రక్షించేందుకు ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్‌‌ కలెక్టర్‌‌ శశాంక ఆదేశించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఫారెస్ట్‌‌ ఆఫీసర్‌‌ రవికిరణ్‌‌తో కలిసి రెవెన్యూ, పోలీస్‌‌, ఫారెస్ట్‌‌ ఆఫీసర్లతో మీటింగ్‌‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌‌ మాట్లాడుతూ ప్రభుత్వ భవనాలు, కమ్యూనిటీ హాళ్లు, రోడ్ల కోసం సర్వే చేసి సరిహద్దులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 

ప్రభుత్వ స్థలాలకు ఫెన్సింగ్‌‌ వేసి ఆఫీసర్లు తమ ఆధీనంలోకి తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఆర్డీవో అలివేలు, డీఎస్పీ సత్యనారాయణ, ఎఫ్‌‌డీవో కృష్ణమాచారి, ఏడీ నరసింహమూర్తి, ఇన్‌‌చార్జి మున్సిపల్‌‌ కమిషనర్‌‌ ఉపేందర్ పాల్గొన్నారు.