
బ్రిడ్జి నిర్మాణ పనులు స్పీడప్ చేయాలి : కలెక్టర్ శశాంక
మహబూబాబాద్, వెలుగు : బ్రిడ్జి నిర్మాణ పనులు స్పీడప్ చేయాలని మహబూబాబాద్కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. బుధవారం గార్ల మండలం బుద్ధారం వద్ద రైల్వే క్రాసింగ్‌పై నిర్మిస్తున్న ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ నెలాఖరులోగా స్లాబ్ వర్క్స్ పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. గార్లలో అఖిలపక్షం నాయకులు కలెక్టర్‌ను కలిసి రాంపురం వద్ద హైలెవల్ బ్రిడ్జి నిర్మించాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం బంజార సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కూల్‌ను కలెక్టర్తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ శివాజీ చౌహన్, సర్పంచ్ భూక్య కమిలి, ఆర్అండ్‌బీ ఈఈ తానేశ్వర్, డీఈ రాజేందర్ పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్సీకి కలెక్టర్ పరామర్శ
కురవి, వెలుగు : మాజీ ఎమ్మెల్సీ గాదె వెంకట్ రెడ్డిని కలెక్టర్ శశాంక సీరోలులోని ఆయన నివాసంలో పరామర్శించారు. ఇటీవల వెంకట్ రెడ్డి భార్య వెంకటమ్మ అనారోగ్యంతో
చనిపోయారు.
ప్రభుత్వాలు తెచ్చే స్కీములన్నీ ఓట్ల కోసమే..
డీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహరాజ్
శాయంపేట, వెలుగు : ప్రభుత్వాలు తీసుకొచ్చే స్కీములన్నీ బీసీ, ఎస్సీ ఎస్టీల ఓట్ల కోసమేనని డీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశారద మహారాజ్ అన్నారు. 10వేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర సందర్భంగా హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా శాయంపేటలో డీఎస్పీ జెండా దిమ్మెలను ఆవిష్కరించి మాట్లాడుతూ ఇప్పుడే కాదు 2వేల ఏండ్లుగా దేశాన్ని అగ్రకులాలే పాలిస్తూ, 90 శాతం పైగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలను బానిసలుగా మార్చారని అన్నారు. దేశం, రాష్ట్రాల్లో గెలిచేవి పార్టీలు కావని, అగ్రకులాలు అని అన్నారు. ఓడేది మాత్రం బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలే అన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి రమేశ్, జిల్లా అధ్యక్షుడు రాజేశ్, లీడర్లు యుగేందర్, అమరేందర్, మధు, ప్రవీణ్ పాల్గొన్నారు.
ఉచిత వైద్య సేవలకు విశేష స్పందన
కాశీబుగ్గ, వెలుగు : వరంగల్సిటీలోని అజర హాస్పిటల్లో నిర్వహించిన ఉచిత వైద్య సేవలకు విశేష స్పందన వచ్చిందని హాస్పిటల్చైర్మన్ డాక్టర్ ఎ.సుధాకర్, మేనేజింగ్డైరెక్టర్ డా.శివసుబ్రమణ్యం తెలిపారు. మంగళవారం చైర్మన్, ఎండీ మాట్లాడుతూ ఈ నెల 8 నుంచి 14 వరకు ఉచిత వైద్య సేవలకు వరంగల్ ఉమ్మడి జిల్లాలోని 3వేల మంది పేషెంట్స్‌కు ఉచితంగా ట్రీట్మెంట్చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్లు సీఈవో తౌటి వెం కటేశ్, డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
బల్దియాలో నేషనల్ఎనర్జీ కన్సర్వేషన్ డే
కాశీబుగ్గ(కార్పొరేషన్), వెలుగు : గ్రేటర్హెడ్డాఫీసులో నేషనల్ఎనర్జీ కన్సర్వేషన్ డేను బుధవారం ఘనంగా నిర్వహించారు. వేడుకలకు చీఫ్‌గెస్ట్‌గా నిట్ప్రొఫెసర్కిరణ్కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పునరుద్ధరించలేని ఇంధన వనరులు పెట్రోలియం ఉత్పత్తులు, బొగ్గును పొదుపు చేయాల్సిన అవసరముందన్నారు. ప్రతి ఒక్కరూ ఒక యూనిట్ ఎనర్జీ(కరెంట్) పొదుపు చేయడం వల్ల రెండు యూనిట్లు ఆదా చేసినట్లవుతుందన్నారు. కార్యక్రమంలో ఇన్స్టిట్యూషన్ ఆఫ్ఇంజనీర్స్ సెక్రటరీ ఉపేందర్ రెడ్డి, చైర్మన్ సాంబయ్య, రాఘవులు, బల్దియా ఆఫీసర్లు పాల్గొన్నారు.
ప్రభుత్వాలు తెచ్చే స్కీములన్నీ ఓట్ల కోసమే..
డీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహరాజ్
శాయంపేట, వెలుగు : ప్రభుత్వాలు తీసుకొచ్చే స్కీములన్నీ బీసీ, ఎస్సీ ఎస్టీల ఓట్ల కోసమేనని డీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశారద మహారాజ్ అన్నారు. 10వేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర సందర్భంగా హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా శాయంపేటలో డీఎస్పీ జెండా దిమ్మెలను ఆవిష్కరించి మాట్లాడుతూ ఇప్పుడే కాదు 2వేల ఏండ్లుగా దేశాన్ని అగ్రకులాలే పాలిస్తూ, 90 శాతం పైగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలను బానిసలుగా మార్చారని అన్నారు. దేశం, రాష్ట్రాల్లో గెలిచేవి పార్టీలు కావని, అగ్రకులాలు అని అన్నారు. ఓడేది మాత్రం బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలే అన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి రమేశ్, జిల్లా అధ్యక్షుడు రాజేశ్, లీడర్లు యుగేందర్, అమరేందర్, మధు, ప్రవీణ్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ జోలికొస్తే ఊరుకోం : డీసీసీ ప్రెసిడెంట్ నాయిని రాజేందర్ రెడ్డి
హనుమకొండ, వెలుగు: కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో పోలీసులు తలదూరిస్తే ఊరుకోబోమని హనుమకొండ డీసీసీ ప్రెసిడెంట్ నాయిని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ వార్ రూమ్ పై దాడికి నిరసనగా హనుమకొండలోని డీసీసీ భవన్ ఎదుట బుధవారం ధర్నా చేపట్టారు. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ కాంగ్రెస్ వార్ రూమ్ పై పోలీసుల పెత్తనం ఏంటని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేక పెరుగుతోందని, అందుకే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దొమ్మటి సాంబయ్య, కార్పొరేటర్లు వెంకటేశ్వర్లు, శ్రీమాన్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సరళ, లీడర్లు డాక్టర్ రామకృష్ణ, బొమ్మతి విక్రం పాల్గొన్నారు.
స్టేషన్‌ఘన్‌పూర్, నల్లబెల్లి, వర్ధన్నపేట, వెలుగు : కాంగ్రెస్ స్ట్రాటజీ, సోషల్ మీడియా వార్ రూమ్, కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ఆఫీస్పై పోలీసుల దాడులు, సీజ్ చేయడాన్ని నిరసి స్తూ ఉమ్మడి జిల్లాలో బుధవారం కాంగ్రెస్శ్రేణులు నిరస న లు, రాస్తారోకోలు చేపట్టారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ లో హైవేపై కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు రాస్తారోకో చేశారు. వర్ధన్నపేట, నల్లబెల్లి, దుగ్గొండి మండలాల్లో కాంగ్రెస్ శ్రేణులు కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
ఈవెంట్స్ కు హాజరయ్యే విద్యార్థులకు మళ్లీ డిగ్రీ ఎగ్జామ్స్ నిర్వహించాలి
హసన్ పర్తి, వెలుగు: ఎస్సై, కానిస్టేబుల్ ఈవెంట్స్ కు హాజరై డిగ్రీ పరీక్షలు రాయలేని విద్యార్థులకు ఎగ్జామ్స్నిర్వహించాలని పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థులు డిమాండ్‌చేశారు. ఈ మేరకు బుధవారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రిన్సిపల్ బన్న ఐలయ్యకు విద్యార్థులు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నేటి నుంచి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో డిగ్రీ 3వ,5వ సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తున్నారని, ఈ ఎగ్జామ్స్ఎస్సై, కానిస్టేబుల్ ఈవెంట్స్ కు హాజరయ్యే విద్యార్థులకు ఇబ్బందికరంగా మారిందన్నారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నరేశ్, కాలేజీ అధ్యక్షుడు ఎ.ప్రవీణ్, అభిలాష్ పాల్గొన్నారు.
మెడికల్ బిల్లులు ఇవ్వడం లేదని హెల్త్ అసిస్టెంట్ నిరసన
జనగామ, వెలుగు : తనకు రావాల్సిన మెడికల్ బిల్లులు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ హెల్త్ అసిస్టెంట్ ధరావత్ రామకృష్ణ డీఎంహెచ్‌వో ఆఫీస్‌లో బుధవారం నిరసన తెలిపారు. హెల్త్అసిస్టెంట్తెలిపిన వివరాల ప్రకారం.. దేవరుప్పుల పీహెచ్‌సీలో హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న తనను జఫర్గఢ్మండలం కూనూరు పీహెచ్‌సీకి డిప్యూటేషన్‌పై పంపారు. అప్పటి నుంచి డీఎంహెచ్‌వో మహేందర్ తరచూ వేధింపులకు పాల్పుడుతున్నాడని ఆరోపించాడు. ఈ క్రమంలో హెల్త్సూపర్వైజర్గా పనిచేసి రిటైరైన తన తండ్రికి సంబంధించిన మెడికల్ రీయంబర్స్మెంట్ బిల్లులు సుమారు రూ.6 లక్షలు, తన శాలరీకి సంబంధించినవి రూ.80 వేల వరకు రావాల్సి ఉందని తెలిపారు. దీనిపై డీఎంహెచ్‌వో రామకృష్ణ శాలరీకి సంబంధించి మా దగ్గర ఎటువంటి పెండింగ్ లేదు. ఆయన తండ్రి మెడికల్ బిల్లులు డీహెచ్ ఆఫీస్ లో పెండింగ్ ఉన్నాయి. మా పరిధిలో ఎటువంటి జాప్యం లేదు.