మహబూబాబాద్ అర్బన్, వెలుగు: తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మురళీనాయక్ అన్నారు. ఆదివారం మున్సిపాలిటీలోని శనిగపురం, బీసీ కాలనీ, ఎన్జీవోస్కాలనీ, లెనిన్‌నగర్, ఇందిరానగర్ సహ పలు కాలనీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి, అక్రమాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం నిలయంగా మారిందన్నారు.
కల్వకుంట్ల కవిత ఢిల్లీలో లిక్కర్ దందా చేసి, ఆడపడుచుల ఆత్మగౌరవన్ని తాకట్టు పెట్టిందన్నారు. కాంగ్రెస్ హయాంలో ఉద్యోగులకు ఒకటోతారీఖు జీతాలు వస్తే... నేడు నెలాఖారు వరకు కూడా జీతాలు పడడడం లేదన్నారు. బీఆర్ఎస్ గుండాలు, భూకబ్జాలు, అక్రమ రియల్‌ఎస్టేల్ వ్యాపారాలతో కోట్లకు పడగలెత్తి పేదలను నిలువునా ముంచుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో కాంగ్రెస్, సీపీఐ నాయకులు దేవరం ప్రకాశ్‌రెడ్డి, విజయసారధి, అజయ్సారధి, రామరాజు బిక్షపతి, వెంకట్‌రెడ్డి, శంతన్‌రామరాజు, హరిసింగ్, సత్యనారాయణ, శ్రీహరి, లాలయ్య తదితరులు ఉన్నారు.