రాష్ట్రమిచ్చాం.. అభివృద్ధి కూడా చేస్తాం : మురళీనాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

నెల్లికుదురు (కేసముద్రం), వెలుగు : ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీయే అభివృద్ధి కూడా చేస్తుందని ఆ పార్టీ మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మురళీనాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు. మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా కేసముద్రం మండలంలోని ధనసరి రేకులతండా, ఉప్పరపల్లి, అర్పణపల్లి గ్రామాల్లో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సంర్భంగా మురళీనాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఉప్పరపల్లిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం మురళీనాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాట్లాడారు. అధికారంలోకి రాగానే ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను తప్పనిసరిగా అమలు చేస్తామని చెప్పారు.

అభివృద్ధి పేరుతో బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రజలను దోచుకుంటుందని విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని, రాష్ట్రంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గెలిపించి సోనియాగాంధీకి గిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఇవ్వాలని కోరారు. అంతకుముందు రేకులతండా ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మండల అధ్యక్షుడు అల్లం నాగేశ్వరరావు, టీపీసీసీ మెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దస్రునాయక్, అంబటి మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.

Also read :- పనిచేసే ప్రతి ఒక్కరికీ గుర్తింపు : చల్లా ధర్మారెడ్డి