
కొత్తగూడ, వెలుగు : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ములుగు ఎమ్మెల్యే సీతక్క చెప్పారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని లింగాల, దుబ్బగూడెం, మామిడిగూడెంలో శనివారం ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ తనను ఓడించేందుకు బీఆర్‌ఎస్ లీడర్లు డబ్బులు వెదజల్లుతున్నారని ఆరోపించారు. తాను ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్నానని, వచ్చే ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం బావురుగొండ, కాటినాగారం, ఎద్దెల్లాపూర్‌కు చెందిన పలువురు కాంగ్రెస్‌లో చేరగా వారికి కండువాలు కప్పారు. ఆమె వెంట ఎంపీపీ సరోజన, జడ్పీటీసీ రమ, మండల అధ్యక్షుడు జాడి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.