మహబూబాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు..

మహబూబాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2020, అక్టోబర్ 18వ తేదీన జరిగిన తొమ్మిదేళ్ల బాలుడి కిడ్నాప్, హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష విధించింది.

ఇంటి బయట ఆడుకుంటున్న తొమ్మిదేళ్ల దీక్షిత్ ను 2020, అక్టోబర్ 18వ తేదీన శనిగపురం గ్రామానికి చెందిన మంద సాగర్ అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడు. పెట్రోల్ బంక్ కు వెళ్దామని చెప్పి... తన బైక్ పై ఎక్కించుకుని తీసుకెళ్లాడు. ఆ తర్వాత గుట్టల్లోకి తీసుకెళ్లి మంచినీళ్లలో తనతో పాటు తీసుకొచ్చిన నిద్రమాత్రలను కలిపి తాగించాడు. బాలుడికి అనుమానం రాకుండా ఉండేందుకు తాను కూడా ఆ నీటిని తాగాడు. 

బాలుడు మత్తులో ఉండగానే గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం హత్య చేసిన ప్రదేశం నుంచి బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. బాలుడి ఇంటి దగ్గరకు వెళ్లి తల్లిదండ్రులు, బంధువుల రియాక్షన్ ను గమనించాడు. కొంత సమయం తర్వాత బాలుడి మృతదేహం వద్ద ఉన్న ప్రదేశానికి వెళ్లిన మందసాగర్ విషయం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో దీక్షిత్ బాడీపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. 

ALSO READ : బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు..జిల్లా జట్టు ఎంపిక

ఆ తర్వాత బాలుడి తల్లిదండ్రులను డబ్బులు డిమాండ్ చేశాడు. ఈ క్రమంలోనే మూడు రోజుల తర్వాత తాళ్ళుపూసపల్లి సమీపంలోని ధానమయ్య గుట్టలో దీక్షత్ రెడ్డి డెడ్ బాడీని గుర్తించారు. అప్పటి ఎస్పీ కోటిరెడ్డి స్యయంగా ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. బాలుడి హత్య కేసులో ప్రధాన నిందితుడు మంద సాగర్ కు జిల్లా కోర్టు మరణ శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.