తొర్రూరు లో రావణ దహనం : ఎర్రబెల్లి దయాకర్ రావు

తొర్రూరు, వెలుగు :  మహబూబాబాద్​ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని అన్నారం రోడ్డు శక్తి స్థలం వద్ద  ఉత్సవ్ కల్చరల్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ పోనుగోటి సోమేశ్వరరావు  ఆధ్వర్యంలో సోమవారం రాత్రి రావణాసుర వద వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగాయి.  ముఖ్యఅతిథిగా రాష్ట్ర పంచాయతీ శాఖరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై   మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.  తొర్రూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో ముందు నిలపడం కోసం నిరంతరం పనిచేస్తున్నట్లు తెలిపారు. గతంలో తొర్రూరు..

ప్రస్తుతం తోరూర్ పట్టణానికి ఎంతో వ్యత్యాసం ఉందన్నారు.20 ఏళ్లుగా నిరంతరాయంగా డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు ఆధ్వర్యంలో రావణాసుర వధ వేడుకలను నిర్వహించడం  అభినందనీయమని  కొనియాడా రు. కార్యక్రమంలో తొర్రూరు  మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, వైస్ చైర్మన్ జినుగ సురేందర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, ఉత్సవ కల్చరల్ డెవలప్మెంట్ సొసైటీ ప్రతినిధులు ధరావత్ రాజేష్ నాయక్, కుర్ర శ్రీనివాస్, బిజ్జాల అనిల్, పొద్దుటూరు గౌరీ శంకర్   పాల్గొన్నారు.