పోలింగ్ ​ప్రశాంతంగా జరిగేలా చూడాలి : డీఎస్పీ తిరుపతిరావు

కొత్తగూడ, వెలుగు: ఏజెన్సీలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్​ను ప్రశాంతంగా జరిగేలా చూడాలని మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు సిబ్బందిని ఆదేశించారు. ఆదివారం ఆయన మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం కోమట్లగూడెం, కాటినాగారం, జంగాలపల్లి, మర్రిగూడెం, కామారం, పూనుగొండ్ల గ్రామాల్లోని పోలింగ్ బూత్​లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతం కావడంతో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆయన వెంట గూడూరు సీఐ బాబురావు, కొత్తగూడ, గంగారం ఎస్ఐలు దీలీప్, రవికుమార్  తదితరులు ఉన్నారు.