మహబూబాబాద్​ జిల్లాలోని పలుచోట్ల మొక్కజొన్న బుగ్గిపాలు

 మహబూబాబాద్​ జిల్లాలోని  పలుచోట్ల మొక్కజొన్న బుగ్గిపాలు

కొత్తగూడ/ నెల్లికుదురు (కేసముద్రం), వెలుగు: మహబూబాబాద్​ జిల్లాలోని పలుచోట్ల చేతికొచ్చిన మొక్కజొన్న పంటకు నిప్పంటుకుని బూడిదయ్యింది. కొత్తగూడ మండలం పెగడపల్లిలో రైతు బొల్లు రవికి చెందిన ఆరు ఎకరాల మొక్కజొన్న పంటకు మంగళవారం మధ్యాహ్నం మంటలు అంటుకున్నాయి. 

రవి, భార్య మంజుల కలిసి మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. నర్సంపేట నుంచి ఫైర్​ ఇంజన్​వచ్చేలోగా పంట పూర్తిగా దగ్ధమైంది.  కేసముద్రం మున్సిపాలిటీలోని అమీనాపురంలో రైతు యార రమేశ్​ ఎకరం మొక్కజొన్న పంటకు నిప్పంటుకుని పూర్తిగా దగ్ధమైంది. పంటలు నష్టపోయిన రైతులు ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.