నాలుగో నంబర్ ఫ్లాట్ ఫారం నిర్మించాలి

నాలుగో నంబర్ ఫ్లాట్ ఫారం నిర్మించాలి

మహబూబాబాద్ అర్బన్, వెలుగు: కొత్తగా వేస్తున్న మూడో రైల్వే లైన్ కు నాలుగో నంబర్ ఫ్లాట్ ఫారం నిర్మించాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్​ మురళీ నాయక్ రైల్వే అధికారులకు సూచించారు. సోమవారం రైల్వే మూడో లైన్ నిర్మాణ పనుల పర్యవేక్షణలో భాగంగా ఎమ్మెల్యే మహబూబాబాద్ రైల్వే స్టేషన్ ను సందర్శించారు. 

మౌలిక వసతుల కల్పనపై ఆరా తీశారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రస్తుతం ఉన్న రెండు ఫ్లాట్ ఫారాలకు అదనంగా నాలుగో ఫ్లాట్ ఫారం నిర్మించాలన్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో రైల్వే కన్ స్ట్రక్షన్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ గంటా శ్రీనివాస్ తోపాటు కాంగ్రెస్ నాయకులు రామగోని రాజు, శంతన్ రామరాజు, చలమల్ల నారాయణ, మదన్ గోపాల్ లోయ, నర్సింహారావు, సిరిపురం వీరు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.