ప్రజా సంక్షేమం కాంగ్రెస్‌‌తోనే సాధ్యం : మురళీ నాయక్‌‌ 

గూడూరు, వెలుగు : ప్రజా సంక్షేమం కాంగ్రెస్‌‌ పార్టీతోనే సాధ్యమని మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని మట్టెవాడలో  ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. కాంగ్రెస్‌‌ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తుందన్నారు.

 ఊట్ల, మట్టెవాడ, కొంగరగిద్దె, హనుమాన్ తండాలాంటి మారుమూల ఏజెన్సీ గ్రామాల్లో బీఆర్‌‌‌‌ఎస్‌‌ హయాంలో ఎలాంటి  అభివృద్ధి చేయలేదని విమర్శించారు.  కాంగ్రెస్‌‌ ప్రభుత్వం అధికారంలో  లేకున్నా  ప్రతి ఒక్కరినీ కంటికి రెప్పలా కాపాడుకున్నామన్నారు.  

ఎంపీ ఎలక్షన్లలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలన్నారు.  మట్టెవాడలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌‌ పార్టీ జెండాను ఆవిష్కరించారు.  సమావేశంలో మండల అధ్యక్షుడు వెంకన్న, వాంకుడోతు కొమ్మాలు, మదు, హెచ్ శివ, శ్రీపాల్ రెడ్డి, వీరస్వామి పాల్గొన్నారు.