
ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ పట్టణంలోని ప్రసిద్ధ నవనాథ సిద్ధులగుట్టను మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ భూక్యా గురువారం కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డితో కలిసి సందర్శించారు. శివాలయం, రామాలయం, అయ్యప్ప, దుర్గమాత ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు.
ఆలయ చరిత్రను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పిరమిడ్ ధ్యాన మందిరాన్ని పరిశీలించారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేతో పాటు వినయ్ కుమార్ రెడ్డికి స్వాగతం పలికి సత్కరించారు. ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, కొంతం మురళి, వెంకట్రామ్ రెడ్డి, కొడిగెల మల్లయ్య పాల్గొన్నారు.