
మహబూబాబాద్, వెలుగు: అర్హులైన రైతులందరికీ బ్యాంకు రుణాల మాఫీ అమలయ్యేలా చూడాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీ నాయక్ బుధవారం రాష్ట్ర అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావుకు రైతుల వివరాలను అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్నికల్ సమస్యల వల్ల మహబూబాబాద్ నియోజకవర్గంలో రూ.2 లక్షల లోపు ఉన్న కొందరు రైతులకు రుణమాఫీ జరగలేదని, వాటిని పరిష్కరించాలని కోరారు. ఈ నెల 21న జరగనున్న బ్యాంకర్ల మీటింగ్ లో నియోజక వర్గానికి సంబంధించిన రైతుల సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరలోనే రైతుల అందరికీ రుణమాఫీ అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.