గూడూరు, వెలుగు : ఆపదలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటానని మాహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ చెప్పారు. గూడూరు మండలంలోని వెంగంపేటకు చెందిన కృష్ణమూర్తి, భూపతిపేటకు చెందిన భద్రయ్య, సీతానగరానికి చెందిన కొమురమ్మ అనారోగ్యంతో మరణించడంతో సోమవారం వారి ఫ్యామిలీలను పరామర్శించి ఆర్థికసాయం, బియ్యం అందజేశారు. అనంతరం ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలు, రోడ్లను పరిశీలించారు.
దొరవారి తిమ్మాపురం వాగుపై రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆఫీసర్లను ఆదేశించారు. ఆయన వెంట జడ్పీ కోఆప్షన్ మెంబర్ ఖాసీం, ఎంపీపీ సుజాత, మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, సురేందర్, లక్ష్మణ్‌రావు, వీరన్న పాల్గొన్నారు.