గూడూరు, వెలుగు : అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ మహబుబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ చెప్పారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తండాలు, గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం రూ. 23 కోట్లతో పనులు చేపట్టిందన్నారు.
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. కాంగ్రెస్, బీజేపీల తప్పుడు ప్రచారాలను ప్రజలు స్థితిలో లేరన్నారు. కేసీఆర్‌ను సీఎం చేసేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీకో ఆప్షన్ మెంబర్ ఖాసీం, మండల అద్యక్షుడు కృష్ణారెడ్డి, రాధికా సురేందర్, రహీం, కఠార్‌సింగ్, సురేశ్, సర్పంచ్ భవాని విష్ణు, రమేశ్, అశోక్, బాలు పాల్గొన్నారు.