మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితకు ఆరు నెలల జైలు శిక్ష పడింది. అంతేకాదు రూ.10వేల జరిమానాను ప్రజా ప్రతినిధుల కోర్టు విధించింది.పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లకు డబ్బులు పంచారన్న కేసులో కోర్టు తీర్పునిచ్చింది. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో.. మాలోత్ కవిత ఓటర్లకు డబ్బు పంపిణీ చేసినట్లు బూర్గంపహాడ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీనికి సంబంధించి శనివారం కోర్టు ఈ విధంగా తీర్పునిచ్చింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఎంపీ కవిత రూ.10వేల జరిమానా చెల్లించగా.. ప్రజా ప్రతినిధుల కోర్టు బెయిల్‌ను మంజూరు చేసింది.
మాలోత్ కవిత తన రాజకీయ జీవితాన్ని 2009లో ప్రారంభించారు. మొదట కాంగ్రెస్‌లో ఉన్న ఆమె తర్వాత TRSలో చేరారు. ప్రస్తుతం ఆమె మహబూబాబాద్ పార్లమెంటు స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.