- రూ. 11.20 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
మహబూబాబాద్, వెలుగు : అక్రమంగా గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను శనివారం మహబూబాబాద్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ మీడియాకు వెల్లడించారు. తొర్రూరు పట్టణ శివారులోని దుబ్బతండా వద్ద శనివారం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు.
ఈ టైంలో అటువైపు వచ్చిన బొలెరోను ఆపి తనిఖీ చేయగా 33 ప్యాకెట్ల గంజాయి కనిపించింది.దీంతో గంజాయి తరలిస్తున్న ఒడిశాకు చెందిన ప్రహల్లాద్ సీస, అప్పన బైరాగి, మిథుల సీస, బసౌతిపంగిని అదుపులోకి తీసుకున్నారు. వీరు గంజాయితో ఒడిశా నుంచి రాజమండ్రి, విజయవాడ, కోదాడ, సూర్యాపేట, దంతాలపల్లి, తొర్రూరు మీదుగా హైదరాబాద్‌కు వెళ్తున్నట్లు ఎస్పీ చెప్పారు.
వారి వద్ద నుంచి రూ. 11.20 లక్షల విలువైన 56 కిలోల గంజాయితో పాటు బొలెరోను, నాలుగు మొబైల్స్‌ను స్వాధీనం చేసుకొని, నలుగురిని రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. నిందితులను పట్టుకున్న తొర్రూరు ఎస్సై జగదీశ్, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. తొర్రూర్ సీఐ సంజీవ, ఎస్సైలు జగదీశ్, రాజు, క్రాంతి కిరణ్ ఉన్నారు.