ప్రయాణికుల భద్రతకే అభయ్‌‌ : ఎస్పీ చంద్రమోహన్‌‌

మహబూబాబాద్‌‌ అర్బన్‌‌, వెలుగు : ప్రయాణికులు, మహిళ భద్రత కోసమే ‘అభయ్‌‌’ అప్లికేషన్‌‌ను రూపొందించినట్లు మహబూబాబాద్‌‌ ఎస్పీ చంద్రమోహన్‌‌ చెప్పారు. బయ్యారం మండలంలోని కోదండరామ ఫంక్షన్‌‌ హాల్‌‌లో శనివారం అభయ అప్లికేషన్‌‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆటోలు, క్యాబ్‌‌లలో ప్రయాణించే వారికి భద్రత కల్పించాలన్న ఉద్దేశంతో ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ ‘మీ భద్రతే మా లక్ష్యం’ అన్న నినాదంతో ఈ అభయ్‌‌ అప్లికేషన్‌‌ను తయారుచేసినట్లు చెప్పారు.

అలాగే జిల్లాలోని వాహనాలకు క్యూఆర్‌‌ కోడ్‌‌తో కూడిన యూనిక్‌‌ నంబర్స్‌‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్‌‌ ఎస్పీ చెన్నయ్య, మహబూబాబాద్‌‌ డీఎస్పీ టి.సత్యనారాయణ, సీఐలు బాబురావు, రమేశ్‌‌, ఫణీధర్‌‌, ఉపేందర్ పాల్గొన్నారు.