వరదల సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడాం.. వార్షిక క్రైమ్​ రిపోర్ట్​ విడుదల

వరదల సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడాం.. వార్షిక  క్రైమ్​ రిపోర్ట్​  విడుదల
  • జిల్లాలో మర్డర్లు, మిస్సింగ్​లు, ఎస్సీ, ఎస్టీ కేసులు పెరిగినవి
  • మహబూబాబాద్​ ఎస్పీ సుధీర్​ రామ్​నాథ్​ కేకన్

మహబూబాబాద్, వెలుగు: జిల్లాలో అకాల వర్షాలతో వరదలు సంభవించిన సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడామని మహబూబాబాద్​ఎస్పీ సుధీర్​రామ్​నాథ్​ కేకన్​అన్నారు. సోమవారం మహబూబాబాద్​ టౌన్​పీఎస్​లో ఆయన క్రైమ్​ వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 2023లో జిల్లాలో 4165 కేసులు నమోదు కాగా, 2024లో 4,327 కేసులు నమోదైనట్లు తెలిపారు.  162 కేసులు అదనంగా నమోదైనట్లు వెల్లడించారు. జిల్లాలో మర్డర్ కేసులు గతంలో 11 , ఈ ఏడాది 16 నమోదైనట్లు తెలిపారు. 

ఎస్సీ, ఎస్టీ కేసులు గతంలో 57, ప్రస్తుతం 61, ప్రాపర్టీ లాస్​కేసులు గతంలో 223 నమోదు కాగా, ప్రస్తుతం 265 కేసులు, పీడీఎస్ బియ్యం తరలింపు కేసులో గతంలో 68 , ఇప్పుడు 97  కేసులు, మిస్సింగ్​కేసులు గతంలో 172, ప్రస్తుతం 207 నమోదయ్యాయయిని వెల్లడించారు. నల్ల బెల్లం తరలింపు కేసులు గతంలో 177, ప్రస్తుతం 146, గుడుంబా తరలింపు కేసులు గతంలో 427, ప్రస్తుతం 859 కేసులు నమోదయ్యాయని, కేసుల ట్రయల్​లో గతంలో 55 మందికి శిక్షలు పడగా, ప్రస్తుతం 76 మందికి శిక్ష పడినట్లు తెలిపారు.

ప్రజలకు అండగా ఉన్నాం.. 

 జిల్లాలో అకాల వర్షాలతో చెరువులు తెగి వరదలు సంభవించిన సమయంలో పోలీసులు ప్రజలకు అండగా నిలిచినట్లు ఎస్పీ సుధీర్​ తెలిపారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చడం, రైల్వే స్టేషన్ లో నిలిచిపోయిన ప్రయాణికులకు ఆహార పదార్థాలను పంపిణీ చేశామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ పని చేస్తున్నట్లు తెలిపారు. 

రోడ్ల పై గుంతలను అనేక చోట్ల పూడ్చినట్లు తెలిపారు. నూతన సంవత్సర వేడుకల్లో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో డీఎస్పీలు తిరుపతి​రావు, కృష్ణకిషోర్, ఏఆర్​ డీఎస్పీలు శ్రీనివాస్, విజయ్​ప్రసాద్, సైబర్​క్రైమ్​డీఎస్పీ శ్రీనివాసరావు, వర్టికల్ డిఎస్పీ మోహన్ తదితరులు పాల్గొన్నారు.  

శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి

భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి జిల్లాలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని, గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది క్రైం రేట్​ స్వల్పంగా పెరిగిందని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. సోమవారం డిస్ట్రిక్ పోలీస్ ఆఫీసులో వార్షిక క్రైమ్​ వివరాలను వెల్లడించారు. గతేడాది మొత్తం 3062 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 3306 కేసులు నమోదయ్యాయని తెలిపారు. 2024లో జరిగిన నేరాలు, నిందితులకు పడిన శిక్షలు, ఎన్ఫోర్స్మెంట్ వర్క్, నేరాల నియంత్రణకు తీసుకొన్న ప్రత్యేక చర్యలు తదితర అంశాలను వివరించారు. 

నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ సూచించారు.  ప్రెస్ మీట్ లో భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ బోనాల కిషన్, డీఎస్పీ ఏ. సంపత్ రావు, డీఎస్పీ నారాయణ నాయక్ పాల్గొన్నారు. అంతకుముందు ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదివాస్​ లో ఎస్పీ పలు ఫిర్యాదులను స్వీకరించారు. సంబంధిత స్టేషన్ లకు ఫోన్​ద్వారా సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.