1,300 కిలోలు పేలుడు పదార్థాలు పట్టివేత

మహబూబాబాద్‌‌‌‌ అర్బన్‌‌‌‌, వెలుగు : అక్రమంగా తరలిస్తున్నపేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు మహబూబాద్‌‌‌‌ ఎస్పీ సుధీర్‌‌‌‌ రాంనాథ్‌‌‌‌ కేకన్‌‌‌‌ చెప్పారు. కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం వెల్లడించారు. మరిపెడ పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌ పరిధిలో బుధవారం పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా వెళ్తున్న ఓ బొలెరోను ఆపి తనిఖీ చేశారు.

అందులో 50 ఎలక్ట్రానిక్‌‌‌‌ డిటోనేటర్స్‌‌‌‌,  32 బాక్స్‌‌‌‌లలో 6,400 జిలెటిన్ స్టిక్స్‌‌‌‌ ఉన్నట్లు గుర్తించారు. పేలుడు పదార్థాలను అక్రమంగా తరలిస్తున్న జగిత్యాల జిల్లాకు చెందిన కస్తూరి కుమార్, మరిపెడ మండలం దంటకుంటకు చెందిన బాదావత్‌‌‌‌ కిశోర్‌‌‌‌, జగిత్యాల జిల్లాకు చెందిన కస్తూరి సారయ్యపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. పేలుడు పదార్థాలను పట్టుకున్న మరిపెడ ఎస్సై తాహెర్‌‌‌‌బాబా, సిబ్బంది క్రాంతికుమార్, వెంకన్నను ఎస్పీ అభినందించారు.