కొడంగల్, వెలుగు: ‘అరుణమ్మ పాలమూరుకు ఏం చేసింది? పాలమూరు– రంగారెడ్డికి స్పెషల్స్టేటస్ఎందుకు తేలేదని నన్ను విమర్శిస్తున్నరు. నేను కేంద్ర మంత్రిని కాదు. నాకు స్టేటస్అంతకన్నా లేదు’ అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్నగర్బీజేపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. శుక్రవారం కొడంగల్‌లో ఆమె మాట్లాడుతూ పాలమూరు జిల్లా అభివృద్దికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు.
గతంలో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ప్రధాని మోదీ 60శాతం నిధులు ఇస్తానని మాటిచ్చారే తప్ప ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించలేదన్నారు. భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టుల కోసం పాలమూరు నుంచి హైదరాబాద్వరకు పాదయాత్ర చేసిన తొలి మహిళగా ఆనాడు తనకు గుర్తింపు దక్కిందన్నారు. వికారాబాద్–కృష్ణ రైల్వే లైన్ కోసం కేంద్రం రూ.2196 కోట్లు మంజూరు చేసిందన్నారు. సర్వే పూర్తి కావడంతో పాటు డీపీఆర్‌లు సిద్ధంగా ఉన్నాయన్నారు. పాలమూరు జిల్లా అభివృద్ధి అవ్వాలన్నా, పాలమూరు ప్రాజెక్టులకు నిధులు కావాలన్నా తనను గెలిపించాలని కోరారు.
నేనే జీవోలు విడుదల చేయించినా...
నిధుల దోపిడీ కోసమే కేసీఆర్ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్డిజైన్మార్చాడని అరుణ ఆరోపించారు. మొట్టమెదట తానే పాలమూరు ప్రాజెక్ట్‌కోసం 69, 72 జీవోలు విడుదల చేయించానన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్రీ డిజైన్ పేరుతో ఇక్కడి ప్రజలను మోసం చేసిండన్నారు. క్రమశిక్షణ కమిటీ మెంబర్నాగురావు నామాజీ, రాష్ర్ట కార్యవర్గ సభ్యులు పున్నంచంద్ లాహోటి, కొడంగల్ఇన్చార్జి రాజవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.