ప్రతి కాలేజీలోయాంటీ డ్రగ్ కమిటీ ఉండాలి : కలెక్టర్ విజయేందిర బోయి

ప్రతి కాలేజీలోయాంటీ డ్రగ్ కమిటీ ఉండాలి : కలెక్టర్ విజయేందిర బోయి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ప్రతి కాలేజీలో డ్రగ్స్  నియంత్రణ కమిటీని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని కలెక్టర్  విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో మాదక ద్రవ్యాల నియంత్రణపై వివిద శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. మాదక ద్రవ్యాల నియంత్రణపై విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు.

విద్యార్థులు డ్రగ్స్  బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డ్రగ్స్  నియంత్రణ కమిటీలు ప్రతి నెలా తప్పనిసరిగా సమావేశం కావాలని ఆదేశించారు. జెండర్  సెన్సిటివిటీపై అవగాహన కల్పించాలని సూచించారు. ఎస్పీ జానకి, అడిషనల్  కలెక్టర్  శివేంద్ర ప్రతాప్, డీఐఈవో కౌసర్ జహాన్, డీఎంహెచ్​వో కృష్ణ, డీడబ్ల్యూవో జరీనా బేగం పాల్గొన్నారు.