- నిబంధనలు పాటించలేదనే..అప్పీల్చేశామన్న కాలేజ్డైరెక్టర్
మహబూబ్‌నగర్, వెలుగు : మహబూబ్‌నగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ డిగ్రీ సీట్లకు సంబంధించి కొత్త అడ్మిషన్ల రికగ్నైజేషన్ను డిస్అప్రూవల్ చేస్తున్నట్లు అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ఎడ్యుకేషన్ బోర్డు డైరెక్టర్ శంభుశరన్కుమార్ఈ నెల 16న లెటర్ఇష్యూ చేశారు. కాలేజీలో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ విధానాన్ని ఎన్ఎంసీ పోర్టల్‌కు లింక్ చేయలేదని అందులో పేర్కొన్నారు. ఫ్యాకల్టీకి సంబంధించిన వివరాలు ఆధార్ ఎనేబుల్డ్బయోమోట్రిక్ సిస్టంలో పొందుపర్చలేదని సీరియస్అయ్యారు.
దీనిపై కాలేజ్ డైరెక్టర్ ఎం.రమేశ్ స్పందించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ మెషీన్లను కాంట్రాక్టర్ ఫీడ్ చేసి వెళ్లారని, ఇన్స్టాలేషన్ మాత్రం చేయలేదన్నారు. బుధవారం 12 సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ మెషీన్లను ఎన్ఎంసీ పోర్టల్‌కు లింక్ చేశామన్నారు. ఎన్ఎంసీకి మెయిల్ కూడా పంపామన్నారు. రికగ్నైజేషన్డిస్అప్రూవల్పై ఈనెల 17న అప్పీల్ చేశామన్నారు.