మహబూబ్‌‌నగర్‌లో‌‌‌ సంబురంగా.. మహానగరోత్సవం

మహబూబ్‌‌నగర్‌లో‌‌‌ సంబురంగా.. మహానగరోత్సవం

వెలుగు స్టాఫ్​ ఫొటోగ్రాఫర్​, మబూబ్​నగర్ : మహబూబ్​నగర్ కార్పొరేషన్​గా అప్‌‌గ్రేడ్‌‌ అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ‘మహబూబ్‌‌నగర్‌‌‌‌ మహానగరోత్సవం’ శుక్రవారం సంబురంగా ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో రెండు రోజుల పాటు జరుగనున్న ఈ కార్యక్రమాన్ని శుక్రవారం కలెక్టర్​ విజయేందిర బోయి, పాలమూరు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌‌రెడ్డి ప్రారంభించారు.

మార్కెట్ స్టాల్స్​, ప్రభుత్వ స్టాల్స్​, గేమ్స్, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ముందుగా స్వచ్ఛ వాహనాలు ప్రారంభించారు ఓపెన్ ఆడిటోరియంలో కల్చరల్​ ప్రోగ్రామ్స్​ నిర్వహించారు. చిన్నారుల నృత్య ప్రదర్శలు ఇచ్చారు. కార్యక్రమంలో ముడా చైర్మన్​ లక్ష్మణ్‌‌యాదవ్​, గ్రంథాలయ చైర్మన్ మల్లు నర్సింహా రెడ్డి, అడిషనల్‌‌ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.